Fastest Electric Car: ఈ కారు స్పీడ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! చీతాను కూడా ఓడించేస్తుందేమో!

రిమాక్ నెవెరా పేరు కలిగిన ఈ కారు గంటకు 412 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు నెలకొల్పొంది. ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఈ-కార్ గా చరిత్ర సృష్టించింది. టూ సీటర్ హైపర్ కారుని జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పేపెన్బర్గ్ ట్రాక్ పై దీనిని విజయవంతంగా పరీక్షించారు.

Fastest Electric Car: ఈ కారు స్పీడ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! చీతాను కూడా ఓడించేస్తుందేమో!
Rimac Nevera
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 31, 2022 | 3:07 PM

ప్రపంచంలో చాలా రకాల రేస్ కార్లు ఉన్నాయి. అవన్నీ దాదాపు ఇంధన సదుపాయంతోనే నడుస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణిలో రేసింగ్ కార్లు చాలా అరుదు. అయితే లోటును భర్తీ చేస్తూ ఓ కారు దూసుకొచ్చింది. రిమాక్ నెవెరా పేరు కలిగిన ఈ కారు గంటకు 412 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి రికార్డు నెలకొల్పొంది. ప్రపంచంలో ఫాస్టెస్ట్ ఈ-కార్ గా చరిత్ర సృష్టించింది. టూ సీటర్ హైపర్ కారుని జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పేపెన్బర్గ్ ట్రాక్ పై దీనిని విజయవంతంగా పరీక్షించారు. దీనిని పరీక్షించిన సమయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు లేరు గాని.. ఉంటే కొత్త రికార్డు నమోదయ్యేదేనని కారు నడిపిన రిమాక్ చీఫ్ టెస్ట్ అండ్ డెవలప్మెంట్ డ్రైవర్ మిరో జ్రెస్విక్ చెప్పారు.

పూర్తి వివరాలు ఇవి..

రిమాక్ నెవెరా హైపర్ కారు ధర దాదాపు రెండు మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇది కేవలం 1.95 సెకన్లలోనే 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుంది. వినియోగదారులకు దీని గరిష్ట వేగం 352 kmph కు ఫిక్స్ చేశారు. అంతకుముందు టాప్ స్పీడ్ గా ఎలక్ట్రిక్ కార్లుగా నిలిచిన పినిన్ ఫరినా బాఠిస్టా(217kmph), అస్పార్క్ ఓల్(249kmph), మోడిఫైడ్ టెస్లా ఎస్ ఫ్లెయిడ్(216kmph)ని ఈ రిమాక్ నెవెరా హైపర్ కారు అధిగమించింది.

ఫీచర్లు ఇవే..

రిమాక్ నెవెరా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైంది. ఇందులో విస్తృత ఎయిర్ డ్యామ్‌తో కూడిన పెద్ద గ్రిల్, చెక్కిన బానెట్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఎల్ఈడీ టైల్‌లైట్లు, యాక్టివ్ వింగ్ , డీఆర్ఎల్ లతో స్వెప్ట్-బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. అలాగే ఈవీ స్పోర్టీ లైట్ వెయిట్ ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్‌ను ఈ కారు కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

స్పెసిఫికేషన్లు ఇవి..

ఆల్-ఎలక్ట్రిక్ రిమాక్ నెవెరా హైపర్‌కార్‌లో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటాయి. ఇవి 1,914 bhp గరిష్ట శక్తిని, 2,360 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారును ఒక్కసారి చార్జి చేస్తే 489 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది.

దాని కన్నా తక్కువే..

ఇంత పెద్ద ఫీట్ చేసిన రిమాక్ నెవెరా.. సాధారణ ఇంధనంతో నడిచే వాహనాల శక్తిని అందుకోలేకపోయింది. బుగట్టి చిరోన్ సూపర్ స్పోర్ట్ 300+ కారు 2019లో సృష్టించిన రికార్డును అధిగమించలేకపోయింది. ఈ కారు 304 mph అంటే దాదాపు 490 kmph వేగంతో దూసుకెళ్లి రికార్డు స‌ృష్టించింది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల్లో మాత్రం రిమాక్ నెవెరా నెలకొల్పిన 412 కిలోమీటర్లే అత్యధిక స్పీడ్ కావడం గమనార్హం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..