Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. చెత్తకుండీలో శిశువు మృతదేహం.. కుక్కలు పీకుతిన్న స్థితిలో…

Hyderabad: రెండు రోజుల క్రితం పుట్టినటువంటి శిశువును సంచి లో తీసుకొచ్చి చెత్తకుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. చెత్తకుండీ దగ్గర కుక్కలు పసికందు ఉన్న సంచిని పీక్కుతింటూ.. ఇళ్ల మధ్యలోకి తీసుకొచ్చాయి.  దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది...శిశువు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కుక్కలు పీక్కొని తిన్నాయి..కుక్కల దాడి లో చనిపోయిన శిశువు తల భాగం, మొండెం వేరయ్యాయి... ఇళ్ల మధ్యలోకి కుక్కలు పసికందు ను శరీర బాగాలను ఎత్తుకొచ్చి తినటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. చెత్తకుండీలో శిశువు మృతదేహం.. కుక్కలు పీకుతిన్న స్థితిలో...
Newborn
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Jyothi Gadda

Updated on: Nov 01, 2023 | 8:41 PM

హైదరాబాద్,నవంబర్01; మానవత్వానికి మచ్చ తెచ్చేలా ఓ పసికందును చెత్తకుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. కళ్లు తెరిచి లోకం చూద్దామనుకున్న ఆ శిశువును పురిట్లోనే హతమార్చారు.. చెత్త కుప్పలో ఉన్న ఆ పసిపాప మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిని ముక్కలు ముక్కలు చేశాయి.. మనుషు ల్లోనీ మానవత్వాన్ని ప్రశ్నించే ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఐడిఎ బొల్లారంలో చోటు చేసుకుంది…పూర్తి వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది..రెండు రోజుల క్రితం పుట్టినటువంటి శిశువును సంచి లో తీసుకొచ్చి చెత్తకుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. చెత్తకుండీ దగ్గర కుక్కలు పసికందు ఉన్న సంచిని పీక్కుతింటూ.. ఇళ్ల మధ్యలోకి తీసుకొచ్చాయి.  దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది…శిశువు మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కుక్కలు పీక్కొని తిన్నాయి..కుక్కల దాడి లో చనిపోయిన శిశువు తల భాగం, మొండెం వేరయ్యాయి… ఇళ్ల మధ్యలోకి కుక్కలు పసికందు ను శరీర బాగాలను ఎత్తుకొచ్చి తినటం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు..

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువు తలభాగాన్ని సేకరించారు.. అనంతరం మున్సిపల్ సిబ్బందికి అప్పగించారు.. అయితే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టిన వారు ఎవరు అన్నది తెలియకుండా పోయింది. రోజుల పసికందును ఎందుకు ఇలా చెత్తలో పడేశారన్నది ఎవరీ తెలియకుండా పోయింది. ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది..

ఇవి కూడా చదవండి

మరోవైపు శిశువు మృతదేహాన్ని చూసిన పోలీసులు ప్రాథమికంగా రెండు రోజుల క్రితం పుట్టినటువంటి శిశువుగా భావిస్తున్నారు. చనిపోయినటువంటి శిశువు ను తీసుకొచ్చి చెత్తకుప్పలో పడవేశారా..? లేదంటే మరేదైన కారణం ఉందా..? అనే దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.. పసికందును కుక్కలు ఇష్టానుసారంగా పీకు తినడంతో ఆడ శిశువా లేక మగ శిశువా అనే దానిపై కూడా స్పష్టత రావలసి ఉంది… ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.. సరిగా కళ్లు కూడా తెరవని శిశువును పుట్టిన కొద్ది రోజులకే చెత్తకుప్పలో పడవేయడం పట్ల విషాదం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు… త్వరితగతిన శిశువుని చెత్తకుండీలో పడేసినటువంటి వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే