Hyderabad: హైదరాబాద్ అద్భుతానికి మాయని మచ్చ.. గూగుల్‌లో సెర్చ్ చేస్తే సూసైడ్ స్పాట్‌గా కేబుల్ బ్రిడ్జ్..
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ అద్భుతం కేబుల్ బ్రిడ్జి.. భాగ్యనగరవాసులకు దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మించగానే సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ దొరికిందంటూ అంతా సంతోషించారు.. అలా జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు అదే ప్లేస్ దురదృష్టవశాత్తు సూసైడ్ స్పాట్‌గా మారింది..
Durgam Cheruvu Cable Bridge: హైదరాబాద్ అద్భుతం కేబుల్ బ్రిడ్జి.. భాగ్యనగరవాసులకు దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మించగానే సాయంత్రం వేళ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ప్లేస్ దొరికిందంటూ అంతా సంతోషించారు.. అలా జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు అదే ప్లేస్ దురదృష్టవశాత్తు సూసైడ్ స్పాట్‌గా మారింది.. కేబుల్ బ్రిడ్జి నిర్మించి మూడేళ్లు అవుతుందో లేదో.. ఇప్పటివరకు 40 మంది వరకు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. వివిధ కారణాలతో ఆయా ప్రాంతాల నుంచి గూగుల్‌లో సెర్చ్ చేసి మరి దుర్గంచెరువు వద్దకు వస్తున్నారు.. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జిపైకి చేరుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తూనే, క్షణాల్లో చెరువులోకి దూకేస్తున్నారు.. ఈ విధంగా కేబుల్ బ్రిడ్జి, దుర్గం చెరువు ప్రాంతాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇలా హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాటుగా మారిందా..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
తాజాగా ఓ వ్యక్తి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కేబుల్ బ్రిడ్జ్‌కి చేరుకున్న గుర్తుతెలియని వ్యక్తి.. అతను తన వెంట వేసుకొని వచ్చిన బైక్‌ను పార్క్ చేసాడు.. అనంతరం అందరి మాదిరిగానే అక్కడున్నటువంటి లైటింగ్స్‌ను.. చుట్టూ ఉన్న ఆహ్లాదకర వాతావరణన్ని, చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు. అందరిలో ఒకరి మాదిరిగా ఎటువంటి అనుమానం రాకుండా ప్రవర్తించాడు. అంతలోనే ఒక్కసారిగా చెరువులోకి దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన డిఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహం కోసం గాలించారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు.. బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. దుర్గం చెరువులోకి దూకిన వ్యక్తి నితీష్ గా గుర్తించారు.. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.
2020లో దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.. గచ్చిబౌలి వెళ్లేందుకు ట్రాఫిక్‌తో తీవ్ర అవస్థలు పడుతున్న నగరవాసులు.. ఈ కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు ట్రాఫిక్ సమస్యలు పోగా.. మరొవైపు ఆహ్లాదకర వాతావరణానికి కేబుల్ బ్రిడ్జి అద్భుతమైన స్పాట్‌గా మారింది. దీంతో ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు నగరవాసులు అక్కడికికి చేరుకుంటున్నారు. అదే సమయంలో సూసైడ్ స్పాట్‌గా కొంతమంది ఎంచుకుంటుండం ఆందోళనకరంగా మారింది. గతంలో సూసైడ్ స్పాట్ అనగానే హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ గుర్తుకొచ్చేది. ఇప్పుడు దానికి ధీటుగా కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. మూడు సంవత్సరాల వ్యవధిలోనే ఇప్పటివరకు 40 మందికి పైగా ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అందులో ఇద్దరు ముగ్గురిని అక్కడే ఉండే లేక్ పోలీసులు వారిని కాపాడారు. కానీ ఎక్కువ శాతం మంది మృత్యు ఓడికి చేరిన వాళ్లే ఉన్నారు.
అనారోగ్య సమస్యలు, ప్రేమ విఫలం, ఇంకేమైన సమస్య ఉన్నా.. గూగుల్లో సూసైడ్ స్పాట్ కోసం వెతుకుతున్నారు. అలా వెతకగానే దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి పేర్లు వస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి ఆత్మహత్య చేసుకునే వారు అక్కడికి వస్తున్నారు. మూడు నెలల క్రితం ప్రేమ విఫలమై పాయల్ అనే యువతి కేబుల్ బ్రిడ్జి పైనుండి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన మరువకముందే నాలుగు రోజుల క్రితం ఓ వ్యక్తి కేబుల్ బ్రిడ్జిపై బైక్ను ఆపి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. మళ్లీ మరొక ఘటన జరగడంతో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారిపోయింది. ఇలా నెలలో 3 నుంచి 4 మంది వరకు దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా పెట్రోలింగ్ నిర్వహించినా.. వచ్చేటటువంటి అనుమానితులను గమనించినా.. ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు దుర్గం చెరువు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..