ఎందుకో ఎరుపెక్కిన సముద్రం..! భయం భయంగా స్థానికులు, పర్యాటకులు.. హుటాహుటిన రంగంలోకి అధికారులు..
గత నాలుగైదు రోజులుగా బీచ్ ప్రాతం లో సముద్రం లో నీటి రంగు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. సముద్రం రంగు మార్పుపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బీచ్ పరిసర ప్రాంతాలలో సమీక్షించి నీటి శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు అధికారులు . ఈ క్రమంలో సముద్రపు నీరు రంగు మారడంపై రకరకాల ఊహాగానాలు రావడంతో బీచ్ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు స్థానికులు, అటు పర్యాటకులు. ఈ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.
నెల్లూరు, నవంబర్01; సూర్యోదయం.. సూర్యాస్తమయం.. అంటే సముద్ర తీరం గుర్తొస్తోంది.. బీచ్ నుంచి సూర్యోదయం.. సూర్యాస్తమయ దృశ్యాలను ఆస్వాదించడం అంటే ఆ అనుభూతి మామూలుగా ఉండదు. సాధారణంగా సూర్యోదయం అంటే తూర్పు తీరం నుంచి మాత్రమే చూడగలం.. అలాగే సూర్యాస్తమయం అంటే పశ్చిమ తీరం నుంచి మాత్రమే అది సాధ్యం. కానీ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈ రెండు చూడగల అరుదైన అవకాశం ఉంటుంది. అలాగే పుదుచ్చేరి, కార్తెక్కల్, చెన్నై, రామేశ్వరం ప్రాంతాల్లో సూర్యోదయం అలాగే సాయంత్రం ప్రశాంతమైన ఆహ్లదకర వాతావరణం ఇక్కడి సొంతం. ఈ ప్రాంతాల్లో నిత్యం వేళ సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అంతటి ఆహ్లాదాన్ని పంచే సముద్ర తీరాలు సందర్శకులను భయపెడుతున్నాయి.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం బీచ్ లో సముద్రంలో ఇసుక నల్లగా మారి ఆందోళన పెంచింది..
అలాగే, ఇటీవల తమిళనాడు లోని పలు ప్రాంతాల్లో సముద్రంలో నీరు రంగులు మారుతూ కొత్త రూపంలో కనబడుతోంది.. ఆ మధ్య చెన్నైలోని మెరినా బీచ్ లో సముద్ర నీరు బులుగు రంగు కాకుండా పచ్చని రంగులో కనిపించింది. అలాగే కొద్దీ రోజుల తర్వాత సాయంత్రం సముద్ర తీరంలో నీటిలో రేడియం లైట్లు వెలిగిన దృశ్యాలు కనిపించాయి. ఇక సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ చూడగలిగే అరుదైన అవకాశం ఉన్న కన్యాకుమారిలో కూడా సముద్రంలో నీరు అసాధారణంగా కనబడింది. తాజాగా పుదుచ్చేరి సముద్ర తీరంలో నీరు రంగు ఎర్రగా మారింది.
పుదుచ్చేరి బీచ్ అందాలను ఆస్వాదించడానికి ప్రతిరోజూ అనేక మంది పర్యాటకులు పుదుచ్చేరి కి వస్తుంటారు. చెన్నై మెరీనా బీచ్ తర్వాత పుదుచ్చేరి బీచ్ అత్యంత ప్రసిద్ధ చెందిన పర్యాటక ప్రదేశం. చెన్నై తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలనుంచి పర్యాటకులు వేల సంఖ్య లో వస్తుంటారు .ఈ నేపథ్యంలో పుదుచ్చేరి సముద్ర తీర ప్రాతం లో చోటుచేసుకుంటున్న పెను మార్పులు పర్యాటకులను ఆందోళనకి గురిచేస్తుంది . గత నాలుగైదు రోజులుగా బీచ్ ప్రాతం లో సముద్రం లో నీటి రంగు పూర్తిగా ఎరుపు రంగులోకి మారిపోతుంది. సముద్రం రంగు మార్పుపై స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బీచ్ పరిసర ప్రాంతాలలో సమీక్షించి నీటి శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు అధికారులు . ఈ క్రమంలో సముద్రపు నీరు రంగు మారడంపై రకరకాల ఊహాగానాలు రావడంతో పుదుచ్చేరి బీచ్ ప్రాంతాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు స్థానికులు, అటు పర్యాటకులు. ఈ పరిస్థితులపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..