Balakrishna: కుంభకోణంలో రాహు పరిహార ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలయ్య.. వీడియో.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాహు పరిహార ప్రత్యేక పూజలకు పేరొందిన ఆలయంలో.. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దేవాలయం అధికారులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు.
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తమిళనాడులోని తంజావురు జిల్లా కుంభకోణం సమీపంలోని తిరునాగేశ్వరం నాగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాహు పరిహార ప్రత్యేక పూజలకు పేరొందిన ఆలయంలో.. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. దేవాలయం అధికారులు బాలకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామి వారికి పాలాభిషేకం చేశారు. పూజ జరుగతున్నంత సేపు స్వామి వారి ఎదుట ఇతర భక్తులతో పాటు తన అభిమానులతో పాటే కూర్చున్న బాలకృష్ణ.. ఎంతో భక్తి పారవశ్యంతో ఉన్నారు. పూజల తర్వాత అర్చకుల వేదాశీర్వచనం అందుకున్నారు. కాగా భక్తులు కొందరు బాలకృష్ణతో ఫొటోలు తీసుకున్నారు. బాలకృష్ణ దేశంలో ఎక్కడకు వెళ్లినా అక్కడ ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దర్శిస్తుంటారు. బాలకృష్ణ టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకెళ్తున్న సీనియర్ హీరో. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..