VarunLav: ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ వేడుక.. ప్రత్యేక గ్లిమ్స్ విడుదల..
Varun Tej - Lavanya Tripathi Marriage: భారత కాలమానం ప్రకారం నవంబరు 1 సాయంత్రం 07.18 గంటలకు వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అవుతారు.ఈ నేపథ్యంలో పెళ్లి ముహుర్తానికి కొన్ని గంటల ముందుగా.. వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక గ్లిమ్స్‌ను మీడియాకు షేర్ చేసింది. ఇది మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మెగా కాంపౌండ్‌లో పెళ్లి సందడి.. హీరో వరుణ్‌తేజ్ , లావణ్య త్రిపాఠిలకు వివాహ వేడుక ఇటలీలో వైభవంగా జరుగుతోంది. నాగబాబు తనయుడి వివాహ వేడుకకు వారి సోదరులు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో పాటు రాంచరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్.. లావణ్య త్రిపాఠి కుటుంసభ్యులు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. భారత కాలమానం ప్రకారం నవంబరు 1 సాయంత్రం 07.18 గంటలకు వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అవుతారు.ఈ నేపథ్యంలో పెళ్లి ముహుర్తానికి కొన్ని గంటల ముందుగా.. వరుణ్ తేజ్ పీఆర్ టీమ్ వివాహ వేడుకకు సంబంధించిన ప్రత్యేక గ్లిమ్స్‌ను మీడియాకు షేర్ చేసింది. ఇది మెగా ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కొంతకాలంగా వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో వివాహా జరిపిస్తున్నారు. టాలీవుడ్‌లో వరుణ్, లావణ్య రెండు సినిమాల్లో కలిసి నటించారు. హీరోగా వరుణ్‌తేజ్ ముకుంద చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతోపాటు ఒక బాలీవుడ్ సినిమాల్లో వరుణ్ నటిస్తున్నారు. ఇక అందాల రాక్షసితో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి…ప్రస్తుతం తెలుగు, తమిళచిత్రాలతోపాటు వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

