Karthi: దానగుణంలో అన్నను మించిన తమ్ముడు.. ఏకంగా 1.25 కోట్ల రూపాయాలు.

Karthi: దానగుణంలో అన్నను మించిన తమ్ముడు.. ఏకంగా 1.25 కోట్ల రూపాయాలు.

Anil kumar poka

|

Updated on: Nov 01, 2023 | 7:36 PM

కోలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు హీరో కార్తీ. గతేడాది పొన్నియన్‌ సెల్వన్‌, సర్దార్‌ సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టేసిన ఈయన... ఈ ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌ 2 తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలోనే తన 25th ఫిల్మ్ 'జపాన్‌' తో దీపావళికి మన ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తన 25th ఫిల్మ్ను మరింత స్పెషల్‌గా మార్చుకునేందుకు కార్తీ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారట.

కోలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు హీరో కార్తీ. గతేడాది పొన్నియన్‌ సెల్వన్‌, సర్దార్‌ సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టేసిన ఈయన.. ఈ ఏడాది పొన్నియన్‌ సెల్వన్‌ 2 తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలోనే తన 25th ఫిల్మ్ ‘జపాన్‌’ తో దీపావళికి మన ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తన 25th ఫిల్మ్ను మరింత స్పెషల్‌గా మార్చుకునేందుకు కార్తీ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారట. తన అన్న సూర్య లాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకోసం ఏకంగా 1.25 కోట్ల రూపాయాలను విరాళంగా అందజేశారట కార్తీ. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు, పేద వారికి అన్నదానాలు ఏర్పాటుచేయడానికి కార్తీ ఈ భారీ మొత్తాన్ని వినియోగించనున్నట్లు తెలుస్తోంది. జపాన్‌ 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు, అలాగే 25 పాఠశాలలకు ఒక్కోదానికి లక్ష రూపాయలు, ఒక్కో ఆస్పత్రికి లక్ష రూపాయల చొప్పున 25 ఆస్పత్రులకు 25 లక్షలు విరాళంగా అందజేయనున్నారట. అలాగే మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు 25 వేల మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారట. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే 25 వేల మందికి అన్నదానం కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందట. ఇటీవలే ఉలవన్‌ సేవా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో స్థానిక టీ. నగర్‌లో కార్తీ అభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. దీంతో నెటిజెన్స్ అందరూ కార్తీని నెట్టింట ఓ రేంజ్లో పొగుడుతున్నారు. దాన గుణంలో అన్నకు తగ్గ తమ్ముడంటూ.. కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..