Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బట్టతల బాధితులకు చక్కటి పరిష్కారం.. కొబ్బరి నూనెను ఇలా వాడితే వారం రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోతుంది

తలస్నానం చేయడానికి గంటన్నర ముందు ఈ నూనెను మీ జుట్టుకు బాగా పట్టించండి. ఈ నూనె జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మెంతి గింజలు విటమిన్లు ఎ, సి, కె, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా అవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరినూనెలో మెంతికూర కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

బట్టతల బాధితులకు చక్కటి పరిష్కారం.. కొబ్బరి నూనెను ఇలా వాడితే వారం రోజుల్లో జుట్టు రాలడం ఆగిపోతుంది
Coconut Oil
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2023 | 8:28 PM

జుట్టు రాలడం చాలా మందిని వేధిస్తున్న సమస్య. మొదట్లో కొన్ని వెంట్రుకలు రాలడం ప్రారంభిస్తాయి. ఇలా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా తల మొత్తం ఖాళీ అయి బట్టతల వచ్చేస్తుంది. జుట్టు రాలడం వల్ల జుట్టు పల్చగా ఉంటే కొబ్బరినూనెను సరిగ్గా రాసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొబ్బరి నూనె జుట్టును బలపరుస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అలాగే, చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ విధంగా కొబ్బరి నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. కొబ్బరి నూనెను జుట్టుకు వివిధ రకాలుగా అప్లై చేయవచ్చు. జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఈ నూనెను రెగ్యూలర్‌గా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసి కొద్దిగా వేడి చేయాలి. కొద్దిగా గోరువెచ్చని కొబ్బరి నూనెతో మీ తలకు మసాజ్ చేయండి. ఈ నూనెను మీ జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల జుట్టుకు పూర్తి పోషణ లభించి జుట్టు రాలడం తగ్గుతుంది.

కొబ్బరినూనె, కరివేపాకు:

కొబ్బరినూనె, కరివేపాకు మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. దీని కోసం, ఒక పాత్రలో కొబ్బరి నూనెను తీసుకుని, దానిలో కొన్ని కరివేపాకులను వేయండి. కరివేపాకు చిటపటలాడాక స్టౌ మీద నుండి నూనె దించండి. ఈ నూనెను జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా పూర్తిగా అప్లై చేయండి. ప్రభావం పెరగాలంటే, మీరు దీనికి ఉసిరికాయను కూడా కలుపుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నిరోధించడంలో సహాయపడే అనేక విటమిన్లు, ఖనిజాలను జుట్టుకు అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనె, మెంతులు :

అరకప్పు కొబ్బరి నూనెను తక్కువ మంటపై వేడి చేయండి. దానికి 2 చెంచాల మెంతి గింజలు కలపండి . ఈ గింజలు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేడి చేయండి. నూనె వేడి అయ్యాక స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. తలస్నానం చేయడానికి గంటన్నర ముందు ఈ నూనెను మీ జుట్టుకు బాగా పట్టించండి. ఈ నూనె జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. మెంతి గింజలు విటమిన్లు ఎ, సి, కె, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లకు మంచి మూలం. అదనంగా అవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి కొబ్బరినూనెలో మెంతికూర కలిపి జుట్టుకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
లావాదేవీల్లో యూపీఐ నయా రికార్డు.. మార్చిలో ఎన్ని కోట్లంటే..?
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
దోమలను తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు మీ కోసం..
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
భర్త 500 రూపాయలు ఇవ్వలేదని.. అలిగి కిటికీ సన్ షేడ్ ఎక్కిన మహిళ
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
ఇక మేం ఢిల్లీకి రాబోం, మోదీయే మా గల్లీకి రావాలి: సీఎం రేవంత్
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
డీసీసీబి సిబ్బంది అతి.. లోన్ కట్టలేదని గొర్రెలు తీసుకెళ్లారు
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
విద్యార్థులను కాపీ కొట్టనివ్వడం లేదని గొడవపడ్డ ప్రిన్సిపల్‌!
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. యమా డేంజర్ గురూ
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
ఏసీని ఎంత ఎత్తులో అమరిస్తే మంచిది..? ఈ పొరపాట్లు చేయకండి!
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
పెళ్లి కొడుకు గుట్టు రట్టు చేసిన కాన్ఫ్‌రెన్స్‌ కాల్‌..
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌
విరాట్ కోహ్లీని అచ్చుగుద్దిన తుర్కియే నటుడు.. ఫోటో వైరల్‌