Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Toilets : రాజధానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద శుభవార్త.!

నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మోబైల్ టాయిలెట్లుగా రూపొందించి వీటిలో ప్రత్యేకంగా స్రీలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు..

Mobile Toilets : రాజధానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు పెద్ద శుభవార్త.!
Mobile Bio Toilets
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 15, 2021 | 2:29 PM

Hyderabad Mobile toilets : రాజధాని హైదరాబాద్ ప్రాంతానికి వివిధ పనుల మీద వచ్చేవారికి, గ్రేటర్ హైదరాబాద్ వాసులకు శుభవార్త. గ్రేటర్లోని ప్రధాన కూడళ్లు.. రద్దీ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు మొబైల్ టాయిలెట్లు ఇవాళ్టి నుంచి పౌరులకు అందుబాటులో వచ్చాయి. నిరుపయోగ ఆర్టీసీ బస్సులను మోబైల్ టాయిలెట్లుగా రూపొందించి వీటిలో ప్రత్యేకంగా స్రీలు, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్లను ఏర్పాటు చేశారు. మొట్టమొదటి సారిగా ట్రాన్స్ జెండర్స్ కు కూడా ఈ మొబైల్ టాయిలెట్లలో సౌకర్యం కల్పించారు. ఇప్పటికే ఈ విధమైన 30 మొబైల్ టాయిలెట్లు నగర వాసులకు అందు బాటులో ఉండగా ఖైరతాబాద్ జోన్ కు కేటాయించిన మరో కొత్త ఐదు మొబైల్ టాయిలెట్లను నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి లు నేడు ప్రారంభించారు.

నెక్లెస్ రోడ్ లోని పార్కింగ్ యార్డ్ లో ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ వెహికల్స్ ప్రారంభోత్సవం సందర్బంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో, సభలు సమావేశాలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈ మొబైల్ టాయిలెట్లను ఎంతో ఉపకరిస్తాయని ఆమె తెలిపారు. ఈ మొబైల్ టాయిలెట్లలో స్త్రీలకు రెండు, పురుషులకు ఒకటి, నాలుగు యూరినల్స్ లతోపాటు పాలిచ్చే మహిళలకు ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశామని మేయర్ వివరించారు.

ఈ బస్సు వెనుక భాగంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయానికి గాను చిన్న షాప్ ఏర్పాటుకు కూడా సౌకర్యం కల్పించామని మేయర్ తెలిపారు. సోలార్ పవర్ విధానం కల్పించిన ఈ మొబైల్ టాయిలెట్ నిర్వహణను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కి ఇచ్చామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, మెడికల్ ఆఫీసర్ భార్గవ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Mobile Toilets

Mobile Toilets

Read also : Govt. Lands sale : ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది : హరీశ్ రావు