AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Govt. Lands sale : ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది : హరీశ్ రావు

ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటాం.. అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 88,500 ఎకరాల భూములు..

Govt. Lands sale : ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం లేఖ రాసింది : హరీశ్ రావు
Harish Rao
Venkata Narayana
|

Updated on: Jun 14, 2021 | 6:06 PM

Share

Harish rao : తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరు గురిగింజ తీరుగా ఉందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మొద్దు.. అమ్మితే మేము అధికారంలోకి వచ్చాక వెనక్కి తీసుకుంటాం.. అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అనడం హాస్యాస్పదంగా ఉందని హరీశ్ వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి 88,500 ఎకరాల భూములు అమ్మారన్న ఆయన, అసలు.. ఆస్తుల అమ్మకం ప్రారంభించిందే కాంగ్రెస్, బీజేపీ పార్టీలని ఎద్దేవా చేశారు. గతంలో “హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు అమ్మి ఆంధ్రాలో, రాయలసీమలో ఖర్చు పెడుతున్నారు అని.. నేను అసెంబ్లీలో అడిగితే..  నేటి ఈ కాంగ్రెస్ నాయకులు నోరు మెదప లేదు.” అని హరీశ్ విమర్శించారు. నాటి ప్రధాని పీవీ నరసింహారావు నుంచి నేటి మోదీ వరకు పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్న వారేనని ఆయన చెప్పారు.

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోయిందన్న ఆయన, నిరర్ధక ఆస్తులు తీసేసి.. సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అడ్డుకోవాలని ప్రతిపక్షలు ప్రయత్నిస్తున్నాయని హరీశ్ ఆరోపించారు. ప్రతిపక్షాలు ప్రజల సంక్షేమం వదిలి.. అధికారయావతో రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన..

“భూముల అమ్మకాలు అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. భూముల అమ్మకాలతో వచ్చే ప్రతి పైసాను ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు చేస్తాం. ప్రభుత్వ ఆస్తులు అమ్మమని.. ఈ ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్ర ఆర్ధిక శాఖ మాకు లేఖ రాసింది. కేంద్రం ODF, BDL, విశాఖ ఉక్కు, రైల్వే వంటి సంస్థలను ప్రయివేట్ పరం చేస్తోంది. 24 ప్రభుత్వ సంస్థల్లోని వాటాలను బీజేపీ ప్రభుత్వం 145 సార్లు అమ్మింది. బీజేపీ ఒక్క సంవత్సరంలోనే పెట్రోల్ మీద 25 రూపాయలు, డీజిల్ మీద 23 రూపాయలు పెంచింది. కరోనా కష్ట కాలంలో తెరాస ప్రభుత్వం ప్రజలను అదుకుంటోంది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్ మీద ఎక్సయిజ్ పన్ను 9 రూపాయలు ఉంటే ఇప్పుడు 32 రూపాయలకు పెంచింది. తెరాస ప్రభుత్వం పేదలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటోంది. అసెంబ్లీ సాక్షిగా.. నిరర్ధక ఆస్తులు అమ్మి ఆదాయం సమకూర్చుకుంటామని బడ్జెట్ లోనే చెప్పాం.” అని హరీశ్ తేల్చి చెప్పారు.

ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వంపై గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ఆగిపోనియమని హరీశ్ కుండబద్ధలు కొట్టారు.

Read also :