Rare Fish: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండంలో చిక్కిన ‘బంగారు తీగ’ చేపలు.. సూర్యాపేట జిల్లాలో అరుదైన ‘ఎర్ర చందనం’
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట....
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మత్స్యకారుల పంటపండిందనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండే రామన్నపేట చెరువులో మత్స్యకారుల వలకు బంగారు తీగ జాతికి చెందిన మూడు చేపలు చిక్కాయి. లేత ఎరుపు వర్ణంలో మెరిసిపోతూ ఉన్న ఆ చేపలను కొనేందుకు జనం పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. వలలో ఇలాంటి చేపలు పడడం చాలా అరుదని… అందులోనూ బంగారు తీగ జాతికి మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. బంగారు తీగ జాతితోపాటు మొత్తం 20 క్వింటాళ్ల చేపలు వలకు చిక్కాయి. ఈ విషయం తెలుసుకున్న సమీప ప్రజలు చేపలను కొనేందుకు చెరువు దగ్గరకు గుంపులు గుంపులుగా తరలివెళ్లారు.
ఇదిలావుంటే సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లి గ్రామ చెరువులో జాలర్లు చేపల వేటకు వెళ్లగా.. వారిలో ఓ జాలరికి 12 కేజీల బరువున్న అరుదైన ‘ఎర్ర చందనం’ రకం చేప లభ్యమైంది. అయితే దీనిపై జిల్లా మత్స్యశాఖ అధికారిణి స్పందిస్తూ.. ఎర్ర చందనం చేపలు తెలంగాణ ప్రాంతంలో అరుదుగా లభిస్తాయని.. దీని శాస్త్రీయ నామం హైపోప్తాలమిటిస్ అని తెలిపారు.
Also Read: జోక్ నచ్చలేదు.. పెళ్లి కొడుక్కి తిక్క లేచింది.. ఏం చేశాడో మీరే చూడండి