Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..
హైదరాబాద్ సాహేబ్‌నగర్ నుంచి మారేడ్‌పల్లి వరకు ఉన్న పైపులైన్ లాలాపేట ఆఫ్‌టేక్ వాల్వుల మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది.
![Hyderabad: హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. రేపు పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2022/04/water-supply-in-hyderabad.jpg?w=1280)
Hyderabad drinking water supply alert: హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి జల మండలి పలు కీలక సూచనలు చేసింది. శుక్రవారం (03-06-2022) రేపు హైదరాబాద్ (Hyderabad) మహా నగరంలో పలు చోట్ల తాగు నీటి సరఫరాకి అంతరాయం ఏర్పడుతుందని ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మహా నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్ – 2 రింగ్ మెయిన్ – 2కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సాహేబ్‌నగర్ నుంచి మారేడ్‌పల్లి వరకు ఉన్న పైపులైన్ లాలాపేట ఆఫ్‌టేక్ వాల్వుల మరమ్మత్తు పనులను జలమండలి చేపట్టనుంది. తార్నాకలోని రైల్వే క్వార్టర్స్ వద్ద ఈ పనులు జరుగుతాయి.
శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మొత్తం 8 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నట్లు హైదరాబాద్ జలమండలి పేర్కొంది. ఈ 8 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని నగర వాసులు సహకరించాలని కోరింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు..
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2: – బాలాపూర్, మైసారం, బార్కాస్.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5: – మేకలమండి, భోలక్‌పూర్.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 7: – తార్నాక, లాలాపేట, బౌద్ధనగర్, మారేడ్‌పల్లి, రైల్వేస్ కంట్రోల్ రూమ్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9: – హస్మత్‌పేట్, ఫిరోజ్‌గూడ, గౌతమ్‌నగర్.
5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10: – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్.
6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13: – మహేందర్‌హిల్స్.
7. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14: – వెలుగుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, బీరప్పగడ్డ
8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20: – మీర్‌పేట, లెనిన్‌నగర్, బడంగ్‌పేట.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..