Viral Photo: ఎంక్వైరీ కోసం ఏకంగా ఆఫీస్‌కు వచ్చేసిన అనుకోని అతిధి.. భయంతో సిబ్బంది పరుగులు

Viral Photo: ప్యానల్ రూమ్‌లోకి చొరబడి అధికారి డెస్క్ వద్ద కనిపించడంతో సిబ్బంది అందరూ భయాందోళనతో పరుగులు తీశారు.

Viral Photo: ఎంక్వైరీ కోసం ఏకంగా ఆఫీస్‌కు వచ్చేసిన అనుకోని అతిధి.. భయంతో సిబ్బంది పరుగులు
Viral Photo
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 02, 2022 | 6:48 PM

Viral Photo: ఈ రోజుల్లో పాములు నివాస ప్రాంతాల్లోకి రావడం సర్వసాధారణమైపోయింది. తాజాగా.. ఆరు అడుగుల కోబ్రా రైల్వే స్టేషన్‌లోని ఎంక్వైరీ ఆఫీస్ రూమ్‌లోకి వెళ్లి హల్‌చల్ చేసింది. ఏదో ఎంక్వైరీ కోసం వచ్చినట్లు స్టేషన్ ఆఫీసర్ డెస్క్ దగ్గర మకాం వేసింది.. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని కోట రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. భారీ కోబ్రా పాము ప్యానల్ రూమ్‌లోకి చొరబడి అధికారి డెస్క్ వద్ద కనిపించడంతో సిబ్బంది అందరూ భయాందోళనతో పరుగులు తీశారు. అయితే.. దాన్ని చూసి ఓ అధికారి ఆ గదిలోని ఓ మూలకు టేబుల్‌పై కూర్చున్నాడు. అయితే.. అప్పుడు కోబ్రా పడగ విప్పి మరి కంట్రోల్ ప్యానెల్‌పై కూర్చొని కనిపించింది. ప్రస్తుతం దీనికి సంంధించిన ఫొటో నెట్టింట షేక్ చేస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారిన ఈ ఫొటో.. కోట డివిజన్ పరిధిలోని రవ్తా రోడ్ (ఆర్‌డిటి) స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్‌కు సంబంధించినదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన బుధవారం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 20 నిమిషాలపాటు పాము అలానే అక్కడ కూర్చున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే.. ఈ ఫోటోను చూసి అందరూ షాక్ అవుతున్నారు. దీంతోపాటు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. నాగుపాము ‘బాస్ లాగా’ డెస్క్ వద్ద కూర్చుంటే.. రైల్వే అధికారి వెనుకన ఓ మూలకు కూర్చున్నాడంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదో ఎంక్వైరీకి వచ్చినట్లు ఆఫీస్ లోపలికి పాము వచ్చిందని.. ఫొటో చూస్తే భయమేస్తుందంటూ పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఫొటో చూడండి..

అదృష్టవశాత్తూ ఈ పాముతో ఎలాంటి హాని కలగలేదని.. దీంతోపాటు రైలు సేవలకు కూడా అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు. రద్దీగా ఉండే ఈ స్టేషన్‌ నుంచి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తారని అధికారులు పేర్కొన్నారు.

Cobra

Cobra

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..