Mobile Tariffs Hike: ద్రవ్యోల్బణంతో ఛార్జీల మోతకు సిద్ధమౌతున్న టెలికాం ఆపరేటర్లు.. ఎంతంటే..
Mobile Tariffs Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య టెలికాం సేవలు మరోసారి ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే టారిఫ్ ల పెంపు కారణంగా..
Mobile Tariffs Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య టెలికాం సేవలు మరోసారి ఖరీదైనవిగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొన్ని నెలల క్రితమే టారిఫ్ ల పెంపు కారణంగా.. మూడు ప్రైవేట్ రంగ టెల్కోల మొత్తం సబ్‌స్క్రైబర్ సంఖ్య 37 మిలియన్ల మేర తగ్గింది. అయితే వారి యాక్టివ్ సబ్‌స్క్రైబర్ బేస్ మాత్రం 3% పెరిగింది. అంటే 29 మిలియన్ల మేర పెరుగుదల కనిపించింది. అటువంటి పరిస్థితిలో.. కంపెనీలు టారిఫ్లలో మరో పెరుగుదల కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య కాలంలో రిలయన్స్ జియో మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌లో భారీ క్షీణత నమోదైందని CRISIL నివేదిక ప్రకారం తెలుస్తోంది. మరోవైపు.. మార్చి 2022 క్వార్టర్ లో కంపెనీ యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు 94% పెరిగారు. ఏడాది క్రితం.. కంపెనీ యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు 78% మాత్రమే ఉండేవారని తెలిపింది. మార్చి త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ యాక్టివ్ సబ్‌స్క్రైబర్లు కూడా 11 మిలియన్ల నుంచి 99% వరకు పెరిగారు.
ఐడియా యాక్టివ్ సబ్‌స్క్రైబర్‌లు 30 మిలియన్లు తగ్గారు. 2020-21లో కంపెనీల ఆదాయాలు 20-25% పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. టెలికాం కంపెనీల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 11% పెరిగి రూ. 149కి చేరుకుంది. డిసెంబర్ 2019లో కంపెనీలు టారిఫ్‌లను పెంచాయి. కానీ.. వారి ARPU వృద్ధి 2021-22లో 5%కి తగ్గింది. 2022-23లో 15-20% ARPU వృద్ధిని సాధించాలని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ కారణాల వల్ల దేశంలోని మూడు దిగ్గజ టెలికాం కంపెనీలు ఈ సారి ఛార్జీలను 20-25 శాతం మేర పెంచవచ్చని తెలుస్తోంది. రానున్న కాలంలో ఇది జరిగితే వినియోగదారులపై మరింత భారాన్ని మోపనున్నాయి.