Bank News: FD వడ్డీ రేట్లను పెంచిన ప్రైవేటు రంగ బ్యాంక్.. సీనియర్ సిటిజన్లకు అదనంగా..

Bank News: ఈ రోజుల్లో చాలా మంది తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటున్నారు. మీరు బ్యాంకులో FD చేయడం ద్వారా డబ్బును ఆదా చేయవచ్చు.

Bank News: FD వడ్డీ రేట్లను పెంచిన ప్రైవేటు రంగ బ్యాంక్.. సీనియర్ సిటిజన్లకు అదనంగా..
Follow us

|

Updated on: Jun 02, 2022 | 8:15 PM

Bank News: ఈ రోజుల్లో చాలా మంది తమ డబ్బును పొదుపు చేసుకునేందుకు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటున్నారు. మీరు బ్యాంకులో FD చేయడం ద్వారా డబ్బును ఆదా చేయవచ్చు. మీరు ప్రైవేట్ రంగానికి చెందిన IndusInd బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే.. ఈ రోజు నుంచి మీ పెట్టుబడిపై అధిక వడ్డీని పొందవచ్చు. కోట్లాది మంది తన ఖాతాదారులకు బ్యాంకు శుభవార్త అందించింది.

జూన్ 1 నుంచి కొత్త రేట్లు అమలులోకి..

ఇండస్ఇండ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంకు వెల్లడించిన కొత్త వడ్డీ రేట్లు ఈ రోజు నుంచి అంటే జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. బ్యాంకు వివిధ కాలాలకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్ల చెల్లించే వడ్డీ రేట్లను పెంచింది. కస్టమర్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాలానికి బ్యాంక్ తాజాగా అందిస్తున్న వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకోండి.

మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?

పొదుపు చేసిన కస్టమర్లకు 7 రోజుల నుంచి 14 రోజుల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. 2.75 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. ఇది కాకుండా 15 నుంచి 30 రోజుల ఎఫ్‌డిలపై 3.00 శాతం, 31 నుంచి 45 రోజుల ఎఫ్‌డిలపై 3.50 శాతం, 46 నుంచి 60 రోజుల ఎఫ్‌డిలపై 3.65 శాతం, 61 నుంచి 90 రోజుల ఎఫ్‌డిలపై 3.75 శాతం, 61 నుంచి 90 రోజుల ఎఫ్‌డిలపై 4.00 శాతం, 121 రోజుల నుంచి 180 రోజుల FDకి 4.50 శాతం చొప్పున వడ్డీ ప్రయోజనాన్ని బ్యాంక్ అందిస్తోంది.

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు..

ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో తమ సొమ్మును దాచుకునే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్ల మేర అదనంగా వడ్డీని చెల్లించనున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. సీనియర్ సిటిజన్లకు బ్యాంక్ 3.25 శాతం నుంచి అత్యధికంగా 7.00 శాతం వరకు వడ్డీ ప్రయోజనాన్ని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.