AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ విషయం తెలుసుకోపోతే జేబుకి చిల్లు..!

Indian Railway:మీరు ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే భారతీయ రైల్వే లగేజీ నిబంధనలని మార్చింది. మీరు ఎక్కువ లగేజీని కలిగి ఉంటే

Indian Railway: రైల్వే ప్రయాణికులకి అలర్ట్‌.. ఈ విషయం తెలుసుకోపోతే జేబుకి చిల్లు..!
Luggage Rules
uppula Raju
|

Updated on: Jun 02, 2022 | 8:07 PM

Share

Indian Railway:మీరు ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే భారతీయ రైల్వే లగేజీ నిబంధనలని మార్చింది. మీరు ఎక్కువ లగేజీని కలిగి ఉంటే ఎక్కువ చెల్లించాల్సిందే. మీరు బుకింగ్ చేయకుండా అదనపు లగేజీని తీసుకెళుతూ పట్టుబడితే ఆరు రెట్లు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. లగేజీకి కనీస ఛార్జీ రూ.30. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు మీరు మీతో పాటు ఎంత లగేజీని తీసుకెళ్లవచ్చో తెలుసుకుందాం.

IRCTC ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్‌ ప్రయాణికులు 70 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఏసీ టూ-టైర్ కోసం ఈ పరిమితి 50 కిలోలుగా ఉంది. ఏసీ 3-టైర్ స్లీపర్, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లలో ఉచిత లగేజీ పరిమితిని 40 కిలోలుగా నిర్ణయించారు. రెండో తరగతి ప్రయాణీకులు తమతో పాటు 25 కిలోల లగేజీని మాత్రమే తీసుకెళ్లవచ్చు. ఇప్పుడు మీరు అదనపు లగేజీని ఎలా తీసుకెళ్లాలో తెలుసుకుందాం.

మీరు ప్రయాణిస్తున్న రైలులో అదనపు లగేజీని తీసుకెళ్లాలనుకుంటే రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు లగేజీ కార్యాలయానికి వెళ్లి ఛార్జీ చెల్లించి బుక్ చేసుకోవాలి. మీరు మీ టిక్కెట్‌ను బుక్ చేసుకునేటప్పుడు లగేజీ టికెట్‌ కూడా బుక్‌ చేసుకోవచ్చు. లగేజీని సక్రమంగా ప్యాక్ చేయకుంటే ఐఆర్‌సీటి టికెట్‌ ఇవ్వదు. కొత్త లగేజీ నిబంధనలను అమలు చేసిన తర్వాత ప్రయాణికులు తక్కువ లగేజీని తమ వెంట తీసుకెళ్లాలని రైల్వే మంత్రిత్వ శాఖ కోరింది. రైలులో ఉచిత పరిమితికి మించి లగేజీతో ప్రయాణించే వారికి జరిమానా విధిస్తారని గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
1.5 టన్ ఏసీని రోజూ 8 గంటలు వాడితే కరెంటు బిల్లు ఎంత వస్తుంది.?
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
ఇది విన్నారా.. సగం ధరకే ఎలక్ట్రిక్‌ స్కూటర్లు!
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
అయ్యయ్యో.. పుచ్చకాయ తింటూ పొరబాటున గింజలు మింగేశారా?
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ..
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
ఈడెన్ గార్డెన్స్‌లో పావెల్ విధ్వంసం.. లక్నో కు 182పరుగుల లక్ష్యం
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్