pm kisan: పదకొండో విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి..!

pm kisan:ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మే 31న పీఎం కిసాన్‌ పదకొండో నిధులని విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

pm kisan: పదకొండో విడత డబ్బులు రాలేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి..!
Pm Kisan
Follow us
uppula Raju

|

Updated on: Jun 02, 2022 | 7:48 PM

pm kisan:ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మే 31న పీఎం కిసాన్‌ పదకొండో నిధులని విడుదల చేశారు. అయితే కొంతమంది రైతులు తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి రైతులు పీఎం కిసాన్‌ డబ్బులు పొందాలంటే ఏం చేయాలి.. ఎవరికి ఫిర్యాదు చేయాలి.. తదితర విషయాలు తెలుసుకుందాం. మీరు పీఎం కిసాన్ లబ్ధిదారులై ఉండి గత వాయిదాలు పొంది ప్రస్తుతం పదకొండో విడత డబ్బులు రాకపోతే ఇలా చేయండి. వెంటనే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించి కంప్లెయింట్ ఇవ్వండి. అలాగే ముందుగా మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి. ఆధార్‌ నెంబర్, పీఎం కిసాన్‌ డబ్బులు పొందే అకౌంట్‌తో లింక్‌ అయిందో లేదో చూడండి.

దీని గురించి మరింత సమాచారం కోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. ఆ తర్వాత మీ వివరాలను పొందడానికి ‘గెట్ డిటైల్స్’ బటన్‌పై క్లిక్ చేయండి. ఇది కాకుండా, రైతులు కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 011-24300606, 155261కు కాల్ చేయవచ్చు. లేదంటే రైతులు pmkisan-ict@gov.in, pmkisan-funds@gov.in అనే మెయిల్ ఐడీ ద్వారా సమాచారం పొందవచ్చు. ఇది కాకుండా రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1800-115-526కు కాల్ చేసి సమస్య విన్నవించవచ్చు.

మీరు e-KYCని పూర్తి చేసినప్పుడు మాత్రమే PM కిసాన్ యోజన లబ్ధిదారులు 11వ విడత డబ్బు పొందుతారు. e-KYC లేకుండా మీ ఇన్‌స్టాల్‌మెంట్ నిలిచిపోయే అవకాశం ఉంది. మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ నుంచి కూడా e-KYC ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ పథకం ప్రయోజనం సాగు కోసం 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఇతర రకాల ప్రభుత్వ పెన్షన్‌ల ప్రయోజనం పొందని రైతులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. దీనితో పాటు, కుటుంబంలో భార్య లేదా భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఇద్దరికి డబ్బులు వస్తున్నట్లయితే అనర్హులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి