Renuka Chowdhury: ఇది నార్త్ ఇండియా కాదు.. బీజేపీ నాయకులపై రేణుకా చౌదరి ఫైర్
చార్మినార్ (Charminar) దగ్గర మత విద్వేషాలు సృష్టిస్తున్నారు.. చార్మినార్ హైదరాబాద్ ప్రజలది అంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.
Renuka Chowdhury on BJP: హైదరాబాద్‌కు చిహ్నమైన చార్మినార్ ఇప్పుడు వివాదంలొ చిక్కుంది. చార్మినార్‌పై రాజకీయ నాయకుల మధ్య లడాయి మొదలైంది. చార్మినార్‌ను ప్రార్థనల కోసం తెరవడానికి అనుమతించాలని స్థానిక ముస్లిం నేతలు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో కొత్త వివాదం తెరలేసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల కత్తుల దూసే వరకు వెళ్లింది. దీనిపై.. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. బీజేపీ జంట నగరాల్లో మత చిచ్చు రగల్చాలని.. పగటి కలలుకంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా అనుకుంటే అది బ్రమ అని.. చార్మినార్ ఒక మతానికి ధర్మానికి సంబంధించినది కాదంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు. చార్మినార్ (Charminar) దగ్గర మత విద్వేషాలు సృష్టిస్తున్నారు.. చార్మినార్ హైదరాబాద్ ప్రజలది అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ దమ్ము గురించి బండి సంజయ్‌కు ఎందుకని ప్రశ్నించారు. చార్మినార్ హైదరాబాద్ ప్రజలది.. నేను ఒంటరిగా చార్మినార్ వస్తా.. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ బండి సంజయ్‌కు.. రేణుకా చౌదరి సవాల్ విసిరారు.
ఇది నార్త్ ఇండియా కాదు.. బీజేపీ పిచ్చి ప్రయత్నాలకు బెదరమని.. తమ దమ్ము ఏంటో చుపుతామంటూ రేణుకా హెచ్చరించారు. ఎక్కువ చేస్తే బండి మిగలదు, గుండు మిగలదు.. సంజయ్ ఖబర్ధార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు మేము ఉన్నాం.. ఖబర్ధర్ బీజేపీ నాయకుల్లారా అంటూ రేణుకా పేర్కొన్నారు. సోనియా గాంధీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని రేణుకా చౌదరి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రేణుకా చౌదరి.. కేసీఆర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను చూస్తే జాలి వేస్తోందని.. తెలంగాణకు అన్యాయం చేసింది ఈ రోజు గుర్తుకు వచ్చిందా అంటూ ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..