AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్కడ లేటుగా ఉదయించే సూర్యుడు.. మధ్యాహ్నమే అస్తమిస్తాడు.. ఎందుకంటే..

Sunset: ఎక్కడైనా సూర్యాస్తమయం అంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అవుతుంటుంది. అదే వేసవిలో అయితే ఇంకొంత ఆలస్యంగా చీకటి పడుతుంటుంది. చలికాలంలో ముందుగానే చల్లబడతాడు సూర్యుడు.

Telangana: అక్కడ లేటుగా ఉదయించే సూర్యుడు.. మధ్యాహ్నమే అస్తమిస్తాడు.. ఎందుకంటే..
Sunset
Ayyappa Mamidi
|

Updated on: Jun 02, 2022 | 4:34 PM

Share

Telangana: ఎక్కడైనా సూర్యాస్తమయం అంటే సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో అవుతుంటుంది. అదే వేసవిలో అయితే ఇంకొంత ఆలస్యంగా చీకటి పడుతుంటుంది. చలికాలంలో ముందుగానే చల్లబడతాడు సూర్యుడు. రోజంతా  వెలుగుని ఇవ్వటంతో పాటు నిప్పులు కురిపించే సూర్యుడు సాయంత్రం వెళ్లిపోగానే అలా బయట చల్లగాలికి ప్రజలు స్వాంతన పొందటం మనం చూస్తుంటాం.  ఆ తరువాత చీకటి రాజ్యమేలుతుంది. ఇది సాధారణంగా మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నదే. అయితే దీనితో కొత్తేంటి.. దీని గురించి అసలు ఇంత చర్చ దేనికి అని అనుకుంటున్నారా.. కానీ, వీటికి భిన్నంగా ఒక గ్రామం ఉందని తెలిస్తే మీ రియాక్షన్ ఏమిటి. అసలు ఒక సారి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఆ గ్రామంలో మాత్రం వీటన్నిటికీ భిన్నంగా సాయంత్రం 4 గంటలకే చీకటి అలుముకుంటుంది. ఇదే సమయంలో అక్కడ సూర్యోదంయ కూడా మనకంటే ఒక గంట లేటుగా జరగటం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఈ వింత జరిగేది ఎక్కడో కాదు.. మన  తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా.. సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక అనే గ్రామంలో జరుగుతోంది. అక్కడ సూర్యుడు ఉదయించటం లేటుగా జరిగినప్పటికీ.. అస్తమయం మాత్రం త్వరగానే జరుగుతుంది.

ఈ కొదురుపాక గ్రామానికి నాలుగు వైపులా గుట్టలు ఉంటాయి. ఈ గుట్టలు సూర్యోదయం, సూర్యాస్తమయాలపై ప్రభావాన్ని చూపుతుంటాయి. గ్రామానికి తూర్పున ఉండే గొల్లగుట్ట సూర్యోదయంపై ప్రభావం చూపుతుండగా.. గ్రామానికి పశ్చిమాన ఉండే రంగనాయకుల గుట్ట కారణంగా గ్రామాన్ని తొందరగా చీకటి ఆవరిస్తుంది. అక్కడ ఉన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా ఈ వింత చోటుచేసుకుంటోంది. ఈ పరిస్థితులకు అలవాటు పడిన ఆ గ్రామస్తులు చీకటి పడే సమయాని కల్లా బయటి పనులు ముగించుకుని ఇళ్లకు తిరిగి వచ్చేస్తుంటారు. మహిళలు పొలం పనుల నుంచి మధ్యాహ్నం మూడు గంటలకే ముగించుకుంటారు. ఈ గ్రామంలో నవాబుల కాలం నాటి గుడితో పాటు కానాల వాగు, ఆహ్లాదకరమైన చల్లటి వాతావరణం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.