CDFD Hyderabad Jobs 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో..హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్‌లో ఉద్యోగాలు..
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD Hyderabad).. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ తదితర పోస్టుల (Technical Officer Posts) భర్తీకి..
CDFD Hyderabad Technical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖలోని బయోటెక్నాలజీ విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (CDFD Hyderabad).. తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్, స్కిల్ వర్క్ అసిస్టెంట్ పోస్టుల (Technical Officer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్, స్కిల్ వర్క్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.30,789ల నుంచి రూ.77,113ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టునుబట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, బీఎస్సీ/బీటెక్, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టైపింగ్, టెక్నికల్ నైపుణ్యాలుండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్/ప్రాక్టికల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: సీడీఎఫ్‌డీ, ఇన్నర్ రిండ్ రోడ్, ఉప్పల్, హైదరాబాద్-500039.
దరఖాస్తు రుసుము:
- జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు: రూ.200
- ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్ సర్వీస్‌మెన్/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30, 2022.
హార్డ్ కాపీలను పంపడానికి చివరితేదీ: జులై 15, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.