NIN Hyderabad Jobs 2022: ఇంటర్/డిగ్రీ అర్హతతో నిన్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు..నెలకు రూ.65,000ల జీతం..
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ - నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ పోస్టుల (Project Co ordinator Posts) భర్తీకి..
NIN Hyderabad Project Co ordinator Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-బి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టుల (Project Co ordinator Posts) భర్తీకి నోటిఫికేసన్ జారీ చేసింది. ఎంపికైనవారు హైదరాబాద్‌లో పనిచేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 5
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-బి, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.65,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్, బీకాం, ఎంపీహెచ్, పీహెచ్డీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ హాజరవ్వొచ్చు.
అడ్రస్: కాన్ఫరెన్స్ హాల్ అండ్ కమిటీ రూం, ఐసీఎంఆర్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (నిన్), హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 10, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.