AP DEECET 2022: ఏపీ డీఈఈసెట్-2022 నోటిఫికేషన్ విడుదల..నేటి నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ రెండు సంవత్సరాల D.EI.Ed, D.I.E.Ts కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ డిప్లొమా ఇన్ ఎటిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET 2022) నోటిఫికేషన్ బుధవారం (జూన్ 1) విడుదలైంది..
AP DEECET 2022 Application Last Date: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరానికి గానూ రెండు సంవత్సరాల D.EI.Ed, D.I.E.Ts కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ డిప్లొమా ఇన్ ఎటిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP DEECET 2022) నోటిఫికేషన్ బుధవారం (జూన్ 1) విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ https://apdeecet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 20. అభ్యర్థులు తప్పనిసరిగా రూ.600 దరఖాస్తు రుసుము చెల్లించాలి.
ఇంటర్ (10+2)/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎవరైనా ఏపీ డీఈఈసెట్-2022కు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 25 నుంచి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఏపీ డీఈఈసెట్ పరీక్ష జూన్ 28, 29 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఫలితాలు జులై 4న ప్రకటితమవుతాయి.
AP DEECET 2022 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.