IRCON Recruitment 2022: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. ఇర్కాన్‌లో నెలకు రూ.80,000ల జీతంతోఉద్యోగాలు.. అర్హతలివే
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన రిఫరెన్స్ పిన్ సెట్టింగ్ ఇంజినీర్, తదితర పోస్టుల (Reference Pin Setting Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..
IRCON Reference Pin Setting Engineer Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON).. ఒప్పంద ప్రాతిపదికన రిఫరెన్స్ పిన్ సెట్టింగ్ ఇంజినీర్, వర్క్స్ లీడర్, స్లాబ్ ట్రాక్ ఇంజినీర్ తదితర పోస్టుల (Reference Pin Setting Engineer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 56
పోస్టుల వివరాలు: రిఫరెన్స్ పిన్ సెట్టింగ్ ఇంజినీర్, వర్క్స్ లీడర్, స్లాబ్ ట్రాక్ ఇంజినీర్, సీఏఎం ఇంజినీర్, రైల్ వెల్డింగ్ టెక్నీషియన్, ఆపరేటర్ పోస్టులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.19,000ల నుంచి రూ.80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్ నాలెడ్జ్ అవసరం.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 28,29,30, జులై 1 తేదీలలోపు దరఖాస్తు చేసుకోవాలి (పోస్టును బట్టి వేర్వేరు చివరి తేదీలున్నాయి).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.