AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హెచ్‎సీఏ కీలక నిర్ణయం.. తెలంగాణలో క్రికెట్ క్యాంపులు.. ఎప్పుడంటే..

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో మెగా సమ్మర్‌ క్రికెట్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి కట్టుబడుతూ, పేద క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్‌ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

Hyderabad: హెచ్‎సీఏ కీలక నిర్ణయం.. తెలంగాణలో క్రికెట్ క్యాంపులు.. ఎప్పుడంటే..
Hyderabad Cricket Assosiati
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Apr 11, 2024 | 8:17 AM

Share

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో మెగా సమ్మర్‌ క్రికెట్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి కట్టుబడుతూ, పేద క్రికెటర్ల కోసం హెచ్‌సీఏ చరిత్రలో తొలిసారి వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు కనీసం 2500 మంది క్రికెటర్లకు నిపుణులైన కోచింగ్‌ సిబ్బందితో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. హెచ్‌సీఏ శిక్షణ శిబిరంలో ఉచిత క్రికెట్‌ శిక్షణ కోసం ఈ నెల 15 నుంచి ఔత్సాహిక క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు వెల్లడించారు.

ప్రతి జిల్లాకు రూ. 15 లక్షలు..

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్దికి హెచ్‌సీఏ కట్టుబడి ఉందన్నారు. వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణ కోసం ప్రతి జిల్లా క్రికెట్‌ సంఘానికి ఇప్పటికే రూ. 15 లక్షల నిధులు విడుదల చేశామన్నారు. ప్రతి జిల్లాలో మూడు కేంద్రాల్లో క్రికెట్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి శిక్షణ కేంద్రానికి రూ. 5 లక్షలు వెచ్చించనున్నట్లు తెలిపారు. ప్రతి శిక్షణ కేంద్రంలో 80-100 మంది వరకు ప్రవేశాలు ఇవ్వనున్నారు. శిక్షణ సమయంలో 30 రోజుల పాటు క్రికెటర్లకు పౌష్ఠికాహారం సైతం అందించనున్నామని చెప్పారు. వేసవి శిక్షణ శిబిరాలను దీర్ఘకాలంలో క్రికెట్‌ అకాడమీలుగా రూపుదిద్దనున్నట్లు ప్రకటించారు. ఏ జిల్లాలోనైనా నిపుణులైన కోచ్‌లు, ఫిజియోలు అందుబాటులో లేకుంటే.. హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఎన్‌ఐఎస్‌ కోచ్‌లు, ఫిజియోలను జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. సమ్మర్‌ క్యాంప్‌ అనంతరం జిల్లా జట్లను ఎంపిక చేసి హైదరాబాద్‌లో జిల్లాల క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లే వెల్లడించారు. జింఖానా తరహా క్రికెట్‌ మైదానాలను హైదరాబాద్‌లో మరో నాలుగు ఏర్పాటు చేసేందుకు హెచ్‌సీఏ ఆలోచన చేస్తుందని పేర్కొన్నారు.

విద్యుత్‌ సమస్యకు పరిష్కారం..

ఉప్పల్‌ స్టేడియం విద్యుత్‌ సమస్యకు హెచ్‌సీఏ పాలకమండలి పరిష్కారం తీసుకొచ్చింది. హెచ్‌సీఏ ఎన్నడూ విద్యుత్‌ బకాయిలు పడలేదు. రూ.1.67 కోట్లకు సంబందించిన నోటీసులు కేవలం సర్‌ చార్జీలకు సంబంధించిన అంశం. సర్‌ఛార్జీలపై మినహాయింపు కోసం గత హెచ్‌సీఏ పాలకమండలి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్రీడల పట్ల ఔత్సాహికంగా ఉన్నారు. దీంతో మేము సైతం సర్‌ఛార్జీల మాఫీ కోసం సీఎంతో సంప్రదింపులు జరపాలని అనుకుంటున్న తరుణంలో విద్యుత్‌ శాఖ అధికారులు మ్యాచ్‌కు ముందు ఎటువంటి సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఇది పూర్తిగా ఊహించని పరిణామం. సీఏంఓ అధికారులు, విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారుల చొరవతో ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం లభించింది. హెచ్‌సీఏ ఇప్పటికే తక్షణ చెల్లింపుగా రూ. 15 లక్షలు జమ చేసింది. మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో మూడు విడతలుగా చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. ఇక నుంచి ఉప్పల్‌ స్టేడియానికి విద్యుత్‌ సరఫరా అంశంలో ఎటువంటి అంతరాయం ఉండబోదు. హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు దేవరాజు, దల్జీత్‌ సింగ్‌, శ్రీనివాసరావు, బసవరాజు, సునీల్‌ అగర్వాల్‌, సీఈవో సునీల్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఉప్పల్‌ స్టేడియం ఆధునీకరణ..

ఉప్పల్‌ స్టేడియం తెలంగాణకు గర్వకారణం. కాలానుగుణంగా స్టేడియాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తూనే ఉన్నాం. 2023 ఐసీసీ వరల్డ్‌కప్‌ సమయంలో స్టేడియంలో నూతన పైకప్పు, సీటింగ్‌, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల ప్రేక్షకుల సౌకర్యం కోసం టాయిలెట్లు, కార్పోరేట్‌ బాక్స్‌ రూమ్‌లు, జనరల్‌ స్టాండ్స్‌, లిఫ్లులు, లాంజ్‌లను ఆధునీకరించాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. ఐపీఎల్‌ సీజన్‌ ముగిసిన అనంతరం ఉప్పల్‌ స్టేడియం ఆధునీకరణ పనులు మొదలుపెట్టనున్నాం. ఉప్పల్‌ స్టేడియం ప్రస్తుత సామర్థ్యం 39 వేలు. అవసరమైతే స్టేడియం సీటింగ్‌ సామర్థ్యం పెంపు అంశం సాధ్యాసాధ్యాలపై ఇంజనీరింగ్‌ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకునే యోచనలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఉంది. హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా కనీసం లక్ష మంది సామర్థ్యంతో కూడిన స్టేడియం అవసరం. అన్నీ అనుకూలిస్తే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మరో నూతన స్టేడియం నిర్మాణానికి సైతం సిద్ధంగానే ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..