Telangana: ఆ ఎంపీ సీట్ పై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు..

ఇప్పుడు ఆ ఎంపీ సీట్ గెలవడం అన్ని ప్రధాన పార్టీలకు చాలా ముఖ్యం.. దీనికోసం మూడు పార్టీల సీనియర్లు ఆ ఎంపీ స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ పార్లమెంట్ పరిధిలో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో బిజీ బిజీ అయిపోయారు నేతలు. మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది.

Telangana: ఆ ఎంపీ సీట్ పై కన్నేసిన ప్రధాన పార్టీలు.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేతలు..
Brs Bjp Congress
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 10, 2024 | 3:35 PM

ఇప్పుడు ఆ ఎంపీ సీట్ గెలవడం అన్ని ప్రధాన పార్టీలకు చాలా ముఖ్యం.. దీనికోసం మూడు పార్టీల సీనియర్లు ఆ ఎంపీ స్థానంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ పార్లమెంట్ పరిధిలో కలియ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకొని పనిలో బిజీ బిజీ అయిపోయారు నేతలు. మెతుకుసీమగా పేరొందిన మెదక్ జిల్లాలోని మెదక్ పార్లమెంట్ స్థానానికి భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానమే ఉంది. ఉద్ధండులుగా పేరొందిన నాయకులు ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. మెదక్ పార్లమెంటుపై ఫోకస్ పెట్టాయి ప్రధాన పార్టీలు. ఎలాగైనా సరే ఈ సీట్‎ను గెలిపించు కోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు. ఈ పార్లమెంట్ పరిధిలో పోటీచేసే అభ్యర్థుల పేర్లను సైతం ఆచితూచి అనోన్స్ చేసాయి ఈ పార్టీలు. ఓ రకంగా చెప్పాలి అంటే ఎంపీ ఎన్నికల కోడ్ రాకముందే ఈ మూడు పార్టీలు ఇక్కడ ప్రచారాలు మొదలు పెట్టాయి. పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం టచ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు తమ పార్టీ ఏం చేసిందో.. ఇక ముందు కూడా ఏం చేయబోతుందో చెప్తు ప్రజల్లోకి వెళ్తున్నాయి ఈ మూడు పార్టీలు. మెదక్ పార్లమెంట్ స్థానం అనేది ఈ మూడు ప్రధాన పార్టీలకు అత్యంత కీలకం అయ్యిందనే చెప్పాలి.

1980లో అధికారం కోల్పోయి రాజకీయంగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని.. మెదక్ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. రాజకీయంగా ఆమెను నిలబెట్టి ప్రధాని పదవిని అధిరోహించేలా చేశారు. అందుకే ఆమె, మెదక్ ప్రజలపై ప్రత్యేక అభిమానాన్ని చూపారు. మొత్తం 16సార్లు మెదక్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరగ్గా 9 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగింది. తాజగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ఇదే ఊపులో మళ్ళీ మెదక్ పార్లమెంట్ స్థానంను దక్కించుకోని పూర్వ వైభవం దక్కించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇక బీఆర్ఎస్ కూడా ఈ నియోజకవర్గన్ని సీరియస్‎గా తీసుకుంది. గతంలో ఉన్న సిద్దిపేట పార్లమెంట్ స్థానం, నియోజకవర్గాల పునర్విభజనలో రద్దవడంతో అందులో కొన్ని అసెంబ్లీ స్థానాలు మెదక్ పార్లమెంట్ స్థానంలో కలిశాయి. సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, పటాన్‌చెరు, దుబ్బాక, గజ్వెల్, సిద్దిపేట సహా మొత్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మెదక్ పరిధిలో ఉన్నాయి.ఈ నియోజకవర్గాల్లో గజ్వెల్, సిద్దిపేట నియోజకవర్గాలు వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్‌కు కంచుకోటగా మారాయి. గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న మెదక్ నియోజకవర్గాన్ని గులాబీ పార్టీ లాగేసుకుంది. మొత్తం నాలుగు సార్లు ఎంపీ ఎన్నికల్లో గెలిచింది బీఆర్ఎస్. అప్పటి నుండి మెదక్ బీఆర్ఎస్ కంచుకోట అయ్యింది.

కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ అదే కసితో పనిచేసి గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు దీన్ని సీరియస్‎గా తీసుకొని అన్ని తానై ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఈ సీట్ గెలవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత అవసరం. ఇక బీజేపీ కూడా మెదక్ స్థానంను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడి నుండి రఘునందన్‌రావును రెండోసారి బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడినా తర్వాత జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తాజాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీచేసి ఓటమిపాలయ్యారు.. అయినప్పటికీ నియోజకవర్గం పై పట్టు,గత పాలనా అనుభవం రఘునందన్‌కు కలిసి వస్తుందనే ఆ పార్టీ యోచించి మళ్ళీ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ప్రచారంలో తనదైన వాక్చాతుర్యంతో దూసుకుపోతున్నారు రఘునందన్‌ రావుదేశంలో మోడీ హవా, రామమందిర నిర్మాణం, ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ నినాదంతో ప్రజల్లోకెళ్తున్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు రఘునందన్.. తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఆయా పార్టీల సీనియర్ లీడర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎప్పుడు లేని ఉత్కంఠ ఈ సారి మెదక్ పార్లమెంట్ పరిధిలో కన్పిస్తుంది. మెదక్ ప్రజలు ఎటు వైపు ఉంటారో.. ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థికంగా ఓ శుభపరిణామం జరుగుతుంది.
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..