Hyderabad: హైదరాబాద్‌ను వెంటాడుతున్న గ్యాస్ వాహనాల డేంజర్.. పట్టించుకునే నాథుడెవరు?

కాలం ముగిసిన LPG, CNG వాహనాలు హైదరాబాద్ లో యధేశ్చగా తిరుగుతున్నాయి. ఎలక్ట్రానికి వాహనాల వరుస పేలుళ్ల నేపథ్యంలో కాలం చెల్లిన గ్యాస్ వాహనాలపై ఇప్పుడు కొత్త ఆందోళన ప్రారంభమైంది.

Hyderabad: హైదరాబాద్‌ను వెంటాడుతున్న గ్యాస్ వాహనాల డేంజర్.. పట్టించుకునే నాథుడెవరు?
CNG Vehicle
Follow us
Ganesh Y - Input Team

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 15, 2022 | 2:39 PM

Gas Vehicles: ఇవి వాహనాలు కాదు…పేలడానికి సిద్ధంగా ఉన్న యంత్రాలు. కాలం ముగిసిన తరువాత కూడా కాసులు దండుకుంటున్న కదిలే బాంబులు. వీటికి చెకింగ్ లేదు. డేంజర్ బెల్స్ మోగిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. అవును.. కాలం ముగిసిన LPG, CNG వాహనాలు హైదరాబాద్ లో యధేశ్చగా తిరుగుతున్నాయి. ఎలక్ట్రానికి వాహనాల వరుస పేలుళ్ల నేపథ్యంలో కాలం చెల్లిన గ్యాస్ వాహనాలపై ఇప్పుడు కొత్త ఆందోళన నెలకొంటోంది. ఈ గ్యాస్ వాహనాలకు నిర్ణీత సమయంలో జరగాల్సిన తనిఖీలు లేకపోవడం, పిట్ నెస్ చెకింగ్ నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేయడం.. ప్రజల పాలిట అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

ఎల్‌పీజీ… సీఎన్జీ… ఈ రెండు వాహనాలు … ఇప్పుడు పెట్రోల్ ..డీజిల్ కు ప్రత్యామ్నాయ వాహనాలుగా నగర రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. 2000 సంవత్సరంలో ప్రారంభమైన గ్యాస్ వాహనాలు… ఒక్క హైదరాద్ లోనే లక్షల సంఖ్యలో పరుగులు పెడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఆటో సర్వీసుల్లో నూటికి 70శాతం ఎల్ పి జీ, సీఎన్ జీ గ్యాస్ వాహనాలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో వస్తున్న ట్రావెల్ కార్లు… ట్రాన్స్ పోర్టు వ్యాన్లు… ఎక్కువగా సీఎన్ జీ వాహనాలే వస్తున్నాయి. ఒక వైపు వాతావరణ కాలుష్యనివారణ, మరోవైపు పెట్రోల్ , డీజిల్ సేవ… నినాదాల మధ్య సీఎన్ జీ వాహనాలు మరింత పెరుగుతున్నాయి. ఇంతకీ… ఈ వాహనాల తో డేంజర్ ఎలా వెండుతోంది అనే ప్రశ్నల మధ్య ఆసక్తికరమైన విషయాలు బయటపడుతున్నాయి.

గ్యాస్ వాహనాలు పిల్లింగ్ లో జరిగే ప్రమాదాలు గుండెలో దడపుట్టిస్తున్నాయి. నూక్లియర్ బాంబుల్లా పేలుతున్నాయి. ఎందుకంటే… కాలం చెల్లినా… రోడ్లపై తిరిగేయడమే దీనికికారణం. . డేంజర్ బెల్స్ మోగిస్తున్న సిలెండర్లతో మరికొన్ని వాహనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫిల్లింగ్ సమయంలో చాలా పీడనంతో గ్యాస్ ను వాహనాల ట్యాంకుల్లోనికి పంపిస్తారు.ఆ సమయంలో ఏమాత్రం ట్యాంకు వీక్ గా ఉన్నా…. కాలం చెల్లిపోయిఉన్నా… ఫిట్ నెస్ లేకపోయినా… ఇలాంటి ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్ గామారుతున్నాయి. ఈ వాహనాలు. అందుకే… ఎల్ పీ జీ వాహనాల ప్రతి మూడేళ్లకు ఒకసారి, ఎల్ పి జీ వాహనాలు ప్రతి 5 ఏళ్ల కు ఒకసారి ఫిట్ నెస్ చెక్ చేసుకుని… సర్టిఫై పొందాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. చాలా వాహనాలు ఏళ్లు గడుస్తున్నా మూవింగ్ బాంబ్ ల్లా రోడ్లపై తిరిగేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఎల్ పి జీ, సీ ఎన్ జీ వాహనాల ట్యాంకులకు ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంది. అయితే ఇప్పటికే 20 ఏళ్లు దాటినా ఇంకా వాటిని మార్చకుండా ఉన్న వాహనాలు ఉన్నాయంటున్నారు టెక్నీషియన్లు. మరో వైపు..కొన్ని వాహనాల్లో ట్యాంకులు ఫిట్ నెస్ కోల్సోయాయని, మరికొన్ని డేమేజ్ అయి ఉన్నాయంటున్నారు. ఇవన్నీ ఎప్పటికైనా డేంజరే అని హెచ్చిరిస్తున్నారు గ్యాస్ వెహికల్స్ పిట్ నెస్ చెకింగ్ సాంకేతిక నిపుణులు. వీటిని కట్టడి చేయాల్సింది ఆర్టీఏ అధికారులు, పోలీసులే. కానీ వారు మాత్రం వీటిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో గ్యాస్ వాహనాల ఫిట్ నెస్ పై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నా..ఇక్కడ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. దీనితో అడ్డూ అదుపూ లేకుండా కాలం చెల్లిన గ్యాస్ వాహనాలు, ఫిట్ నెస్ లేకుండానే సంచరిస్తున్న వెహికల్స్ నగర రోడ్లపై బలా దూర్ అంటున్నాయి.

ఎండలు బాగా ఉన్న సమయాల్లో గ్యాస్ వెహికల్స్ తో కొంత అలర్ట్ గానే ఉండాలి. ఎందుకంటే… వేసవిలో గ్యాస్ సిలెండర్లు ఉన్న వాహనాలు… ఎలా ఉండాలి? ఎండలో ఉంటే ఏం జరుగుతుంది అనే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. అయితే…. ఎప్పటి కప్పుడు చెకింగ్ లతో పాటు.. అప్రూవల్ గ్యాస్ కిట్స్ వాడకం ఉండాలంటున్నారు. అయితే కంపెనీ నుంచి వచ్చిన కిట్లు కాకుండా తక్కువ ఖర్చుతో అవుతుందని ప్రైవేటుగా తయారుచేయించుకుని గ్యాస్ కిట్లు వినియోగించడం మరింత ప్రమాదంగా మారుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఏదైనా.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు కాలం చెల్లిన గ్యాస్ వాహనాలు… దడపుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల భయపడెతున్న సమయంలో అధికారులు కాలం చెల్లిన కిట్స్‌తో నడుస్తున్న గ్యాస్ వెహికల్స్‌పై సీరియస్ గా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

(వై. గణేష్, టివి9 తెలుగు, హైదరాబాద్)

మరిన్ని హైదరాబాద్ వార్తలు చదవండి..