Hyderabad: రెప్పపాటులో మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్.. వీడియో చూస్తే శభాష్ అనాల్సిందే..
ప్రయాణికులకు విజ్ఞప్తి.. కదులుతున్న రైలును ఎక్కడం లేదా దిగడం ప్రమాదకరం.. చట్టవిరుద్ధం.. ఇది తీవ్రమైన గాయాలకు లేదా మరణానికి దారితీస్తుంది. ప్రయాణికులు ఎల్లప్పుడూ రైలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రమే ఎక్కాలి లేదా దిగాలి.. లేకపోతే ప్రమాదంలో పడతారు.. అలా ఎప్పుడూ చేయొద్దు అంటూ.. ఇండియన్ రైల్వే తరచూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తుంటుంది..

ప్రయాణికులకు విజ్ఞప్తి.. కదులుతున్న రైలును ఎక్కడం లేదా దిగడం ప్రమాదకరం.. చట్టవిరుద్ధం.. ఇది తీవ్రమైన గాయాలకు లేదా మరణానికి దారితీస్తుంది. ప్రయాణికులు ఎల్లప్పుడూ రైలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత మాత్రమే ఎక్కాలి లేదా దిగాలి.. లేకపోతే ప్రమాదంలో పడతారు.. అలా ఎప్పుడూ చేయొద్దు అంటూ.. ఇండియన్ రైల్వే తరచూ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తుంటుంది.. ప్రతి రైల్వే స్టేషన్‌లో ఈ అనౌన్స్‌మెంట్ మోగుతూనే ఉంటుంది. కానీ.. కొందరు మాత్రం ఈ విజ్ఞప్తిని అస్సలు పట్టించుకోరు.. అంతా తెలిసినా కూడా ప్రణాలను ప్రమాదంలో పడేసుకుంటుంటారు.. తాజాగా.. చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైతుల ఎక్కబోయి మహిళ కిందపడింది.. ఈ క్రమంలోనే.. ఆమెను గమనించి మహిళా కానిస్టేబుల్ వెంటనే స్పందించింది. రెప్పపాటులో ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడింది..
చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ విజయ ప్రమాదంలో ఉన్న ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. చర్లపల్లి స్టేషన్‌లో కదులుతున్న రైలులో ఎక్కడానికి ప్రయత్నించిన ఓ మహిళ ఒక్కసారిగా జారి కింద పడిపోయింది. అక్కడే డ్యూటీలో ఉన్న ఉమెన్ రైల్వే కానిస్టేబుల్ విజయ చాకచక్యంగా స్పందించి ఆ మహిళను కాపాడారు. మహిళా ప్రయాణికురాలు తినుబండారాల స్టాల్ వద్ద ఏదో కొనుక్కొని.. మళ్లీ రైలు ఎక్కుతుండగా ఈ ఘటన జరిగింది.
వీడియో చూడండి..
కాగా.. మహిళను కాపాడిన అనంతరం వెంటనే విజయ.. ట్రైన్ ను ఆపించారు. అయితే.. కానిస్టేబుల్ విజయ చాకచక్యంగా వ్యవహరించిన తీరును అధికారులు అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




