గణేషుడి నిమజ్జనంలో కాల్పుల కలకలం

గణేషుడి నిమజ్జనం వేళ కాల్పులు కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని హైదర్ష్‌ కోట్‌లో నాగ మల్లేష్‌ అనే ఓ ఆర్మీ మాజీ అధికారి రివాల్వర్‌లో హల్‌చల్ చేశాడు

గణేషుడి నిమజ్జనంలో కాల్పుల కలకలం
TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 28, 2020 | 10:06 AM

Ganesh Immersion Hyderabad: గణేషుడి నిమజ్జనం వేళ కాల్పులు కలకలం రేపాయి. హైదరాబాద్‌లోని హైదర్ష్‌ కోట్‌లో నాగ మల్లేష్‌ అనే ఓ ఆర్మీ మాజీ అధికారి రివాల్వర్‌లో హల్‌చల్ చేశాడు. కోపంతో ఊగిపోయి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒకటి గాల్లోకి, మరొకటి ఓ వ్యక్తిపైకి గురిపెట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి చెవి పక్క నుంచి బుల్లట్ పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. నాగ మల్లేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఈ కాల్పులకు మందు పార్టీ కారణమని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటిపై హైరీచ్ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారని, పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్న కోపంతో నాగ మల్లేష్ ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Read More:

Breaking: రొట్టెల పండుగ రద్దు.. ఉత్తర్వులు జారీ

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,932 కొత్త కేసులు.. 11 మరణాలు


లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu