యువతిపై 139 అత్యాచారం కేసులో కీలక పరిణామం
తనపై గత కొన్ని సంవత్సరాలుగా 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
తనపై గత కొన్ని సంవత్సరాలుగా 139 మంది అత్యాచారం చేశారంటూ పంజాగుట్ట పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేయడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కేసు సీసీఎస్ పోలీసులకు బదిలీ చేశారు. తాజాగా ఈ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసును విచారించడానికి ప్రత్యేక పోలీసు అధికారిణిని నియమించారు. ఇక నుంచి ఏసీపీ శ్రీదేవి ఈ కేసును దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. యువతి పోలీసులకు స్టేట్మెంట్‌ను, ఆధారాలను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలను పంజాగుట్ట పోలీసులకు బాధిత యువతి అందజేయగా… ఇక, పూర్తి ఆధారాలు సేకరించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు సీసీఎస్ ప్రత్యేక దర్యాప్తు బృందం రెడీ అవుతోంది.
Also Read :
విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్ నేత జశ్వంతరావు మృతి
సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు
జగన్ సర్కార్ కీలక నిర్ణయం : స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు