జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ది, నిధుల స‌మీక‌ర‌ణ దిశ‌గా ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ శాఖలకు, ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన నిధులు సేకరణ లక్ష్యంగా ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది.

జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం : స్టేట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు
Follow us

|

Updated on: Aug 28, 2020 | 8:02 AM

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ది, నిధుల స‌మీక‌ర‌ణ దిశ‌గా ఏపీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ శాఖలకు, ప్రాజెక్టులు, పథకాలకు అవసరమైన నిధులు సేకరణ లక్ష్యంగా ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థగా ఏపీఎస్​డీసీని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్ల‌డించింది. అనేక రంగాల్లో స్థిరమైన అభివృద్ధే లక్ష్యంగా ఏపీఎస్​డీసీ ఏర్పాటు చేస్తునట్లు గ‌వ‌ర్న‌మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. వివిధ ట్యాక్స్ ల ద్వారా ఏపీఎస్​డీసీకి నిధులు సమకూర్చ‌నుంది ప్ర‌భుత్వం.

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యకలాపాలకు ప్రణాళిక, నిధులు, పెట్టుబడులపై ఈ సంస్థ ఫోక‌స్ పెట్ట‌నుంది. ప్రాథమికంగా యాభై వేల ఈక్విటీ షేర్ల‌తో సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో షేర్‌ ధర రూ.10 నిర్ణయించారు. ఆరుగురు సభ్యులతో ఏపీఎస్​డీసీ బోర్డు ఏర్పాటుచేస్తూ ఆదేశాలు జారీచేశారు.

బోర్డు ఛైర్ పర్సన్ గా సీఎస్‌, వీసీ, ఎండీగా… ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్​లుగా… రెవెన్యూ, మైన్స్, ఇద్దరు ఆర్థిక శాఖ కార్యదర్శులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్రెడిట్ కమిటీ, ఆడిట్ కమిటీ, ఇన్వెస్ట్​మెంట్ కమిటీ, రిస్క్ మేనేజ్​మెంట్ కమిటీతో పాటు ఇతర కమిటీలు ఏర్పాటు చేయాలని బోర్డుకి ఆదేశాలు జారీచేశారు.

Also Read :

విషాదం : కరోనాతో సీపీఐఎంఎల్‌ నేత జశ్వంతరావు మృతి

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు