Pan Card Update: పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు

పాన్ కార్డులోని వివరాలలో తప్పులు ఉంటే ఆందోళన చెందకండి. చాలా సులభంగా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ తప్పులను సరిచేసుకోవచ్చు. ఈ కింద తెలిపిన పద్ధతులను పాటించి, చాాలా వేగంగా పాన్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చు. దాని కోసం అవసరమైన పత్రాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

Pan Card Update: పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు
Pan Card
Follow us

|

Updated on: Apr 26, 2024 | 3:47 PM

దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో, పాన్ కార్డు కూడా అంతే అవసరం. ఆధార్ కార్డు మీకు వివిధ పథకాలు పొందడానికి పనికి వస్తుంది. పాన్ కార్డు ఆర్థిక సంబంధ విషయాలలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆదాయపు పన్ను ఫైలింగ్‌లకు కీలకమైన గుర్తింపు పత్రంగా పనిచేస్తుంది. దానిలోని సమాచారం అంతా దోషరహితంగా ఉండేలా చూసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఫొటో, సంతకం, తండ్రి పేరు, ఆధార్, లింగం, చిరునామా తదితర వివరాలలో తప్పులు లేకుండా ఉండాలి. ఒకవేళ తప్పులుంటే వెంటనే సరిచేసుకోవాలి. ఆలస్యం చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

అప్ డేట్ చాలా సులభం..

పాన్ కార్డులోని వివరాలలో తప్పులు ఉంటే ఆందోళన చెందకండి. చాలా సులభంగా వాటిని సరిచేసుకునే అవకాశం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ తప్పులను సరిచేసుకోవచ్చు. ఈ కింద తెలిపిన పద్ధతులను పాటించి, చాాలా వేగంగా పాన్ కార్డును అప్ డేట్ చేసుకోవచ్చు. దాని కోసం అవసరమైన పత్రాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

పాన్ కార్డును అప్ డేట్ చేసే విధానం..

  • ముందుగా ఎన్ఎస్ డీఎల్ ఈ-జీవోవీ పోర్టల్ కు వెళ్లాలి.
  • దానిలోని సర్వీసెస్ ఆప్షన్ కు వెళ్లి, డ్రాప్ డౌన్ మెనూ లోని పాన్ అనే దానిని ఎంపిక చేసుకోవాలి.
  • చేంజ్ / కరెక్షన్ ఇన్ పాన్ డేటా అనే దానిని ఎంపిక చేసుకుని, అప్లయ్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ కనిపించిన అప్లికేషన్ లో అడిగిన వివరాలను నమోదు చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ ఈమెయిల్ కు ఒక టోకెన్ నంబర్ వస్తుంది. వివరాల నమోదులో ఆలస్యం కారణంగా టైమౌట్ అయితే ఆ నంబర్ ఉపయోగపడుతుంది. అనంతరం కంటిన్యూ విత్ పాన్ కార్డ్ అప్లికేషన్ అనే దానిపై క్లిక్ చేయండి.
  • స్క్రీన్ పై మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. దానిలో మొదట ఉన్న సబ్మిట్ డిజిటల్లీ వయా ఈకేవైసీ, ఈ సైన్ (పేపర్ లెస్) అనే ఆప్షన్ ను ఎంచుకోండి. దాని ద్వారా ఆధార్ ఓటీపీ ని ఉపయోగించి పాన్ కార్డును ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
  • అప్ డేట్ చేసిన పాన్ కార్డు వివరాల కాపీ మీకు కావాలంటే ఎస్ అనే దానిపై క్లిక్ చేయండి. ఈ సేవకు మీకు కొంత చార్జీ పడుతుంది.
  • మీ ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను టైప్ చేయండి. అప్ డేట్ చేయాల్సిన వివరాల పక్కన ఉన్న బాక్సులలో టిక్ పెట్టింది. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి.
  • పాన్ కార్డు కాపీతో కలిసి గుర్తింపు పత్రాలన్నింటినీ అటాచ్ చేయాలి. సంతకంతో ఉన్న ఫొటోను అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు ఫారంలో వివరాలను సరిచూసుకుని, మీ ఆధార్ కార్డులోని మొదటి 8 నంబర్లను ఎంటర్ చేయాలి. అనంతరం పేమెంట్ పేజీలోకి వెళ్లి డబ్బులు కట్టాలి. మీ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ విత్ ఈసైన్ పై క్లిక్ చేయాలి.
  • రశీదు ఫారాన్ని ధ్రువీకరించడానికి, డౌన్‌లోడ్ చేయడానికి మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఉపయోగపడుతుంది.

మరో మార్గం..

యూటీఐఐటీఎస్‌ఎల్ పోర్టల్ లో కూడా పాన్ కార్డులో వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంది.

  • ముందుగా యూటీఐఐటీఎస్‌ఎల్ వెబ్ సైట్‌కు వెళ్లండి.
  • చేంజ్ / కరెక్షన్ ఇన్ పాన్ కార్డు ట్యాబ్ లోని క్లిక్ టు అప్లయ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • అప్లయి ఫర్ చేంజ్ / కరెక్షన్ ఇన్ పాన్ కార్డ్ డిటైల్ ను ఎంపిక చేసుకోండి.
  • డాక్యుమెంట్లను సబ్మిట్ చేసే విధానాన్ని ఎంపిక చేసుకుని, అన్ని వివరాలు పూర్తి చేసి, సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీకు రిఫరెన్స్ నంబర్ వస్తుంది.
  • మీపేరు, చిరునామా వివరాలను పూర్తిచేయాలి.
  • మీ పాన్ నంబర్ ను ఎంటన్ చేసి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. మార్పు చేయాలనుకున్న దానికి సంబంధించి పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • దాదాపు 15 రోజులలో పాన్ కార్డు అప్ డేట్ అవుతుంది. మీ పాన్ కార్డు పోస్టులో మీకు అందుతుంది.

ఆఫ్ లైన్ విధానం..

  • ఇంటర్నెట్ లో పాన్ కార్డు కరెక్షన్ ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి.
  • దానిని పూర్తి చేసి, అవసరమైన అన్ని పత్రాలను జతచేసి, మీ సమపంలోని పాన్ కేంద్రంలో అందజేయాలి.
  • మీరు పేమెంట్ పూర్తి చేసిన తర్వాత పాన్ కేంద్రం నిర్వాహకులు అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ ఇస్తారు.
  • 15 రోజులలోపు ఎన్ఎస్ డీఎల్ ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కు స్లిప్‌ను పంపాలి.

పాన్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే విధానం..

  • ఎన్ఎస్ డీఎల్ పాన్ వెబ్ సైట్ లేదా యూటీఐఐటీఎస్ ఎల్ వైబ్ సైట్ ను సందర్శించండి.
  • డౌన్ లోడ్ ఈ పాన్/ ఈ పాన్ ఎక్స్ ఎమ్ ఎల్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • పాన్ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు