NTR: స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేస్తా.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న తారక్ మాటలు

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ కు ఏకంగా ఆస్కార్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో తారక్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తో కలిస్ తారక్ అద్భుతంగా నటించి మెప్పించారు.

NTR: స్టార్ హీరోతో మల్టీస్టారర్ చేస్తా.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న తారక్ మాటలు
Ntr
Follow us

|

Updated on: Apr 26, 2024 | 3:10 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్నటివరకు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులారీటీ తెచ్చుకున్నారు తారక్. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకొని విదేశాల్లోనూ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని సాంగ్ కు ఏకంగా ఆస్కార్ వచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో తారక్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తో కలిస్ తారక్ అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు తారక్ వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తనకు ఆ స్టార్ హీరోతో మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ అన్నారు. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. తమ స్టార్ డమ్ ను పక్కన పెట్టి మరీ మరో హీరోతో కలిసి సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు హీరోలు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా కూడా తెరకెక్కింది. ఈ సినిమాలో చరణ్ తో కలిసి తారక్ నటించారు. అయితే ఇప్పుడు ఆయన మల్టీ స్టారర్ సినిమా చేయాలని అనుకుంటే ఎవరితో చేస్తారు అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పారు.

గతంలో ఎన్టీఆర్ జయప్రదతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో జయప్రద తారక్ ను కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అడిగారు. ఈ క్రమంలోనే మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని జయప్రద అడగ్గానే టక్కున మహేష్ అని సమాధానం ఇచ్చాడు తారక్. అలాగే నాకు అపశ్యన్స్ కూడా వద్దు అని అన్నారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు అభిమానులు, తారక్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎన్టీఆర్ , మహేష్ బాబు చాలా సన్నిహితంగా ఉంటారు. తారక్ మహేష్ ను అన్న అని పిలుస్తూ ఉంటారు.

ఎన్టీఆర్  ఇన్ స్టా..

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

 మహేష్ బాబు ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.