Hyderabad: హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ.లక్షకు 2 శాతం ఇంట్రెస్ట్ అంటూ రూ.కోట్లలో వసూళ్లు.. చివరకు..

తక్కువ టైమ్‌లో ఎక్కువ ఆదాయం చూపిస్తాం. ట్రేడింగ్‌లో ఆరితేరాం.. ఊహకందని రిటర్న్స్ తీసుకొస్తామంటే.. నమ్మేసి పెట్టుబడి పెట్టారు. ఇంకేముంది నట్టేట ముంచేశాడీ కేటుగాడు.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ మోసం.. రూ.లక్షకు 2 శాతం ఇంట్రెస్ట్ అంటూ రూ.కోట్లలో వసూళ్లు.. చివరకు..
Online Frauds
Follow us

|

Updated on: Nov 16, 2022 | 7:00 AM

హైదరాబాద్ పరిధిలో మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ ముసుగులో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో అమాయకులతో పెట్టుబడులు పెట్టించి.. నిలువునా ముంచేసిందో కంపెనీ. ఏకంగా 8వేల మందికి కుచ్చుటోపీ పెట్టాడు. హబ్సిగూడలో రియల్ లైఫ్ ఇన్ ఫ్రా పేరుతో ముక్తిరాజ్ అనే వ్యక్తి ఓ కంపెనీ స్టార్ట్ చేశాడు. 11 కమోడిటీస్‌లో పనిచేస్తామంటూ లోకల్‌‌గా అందరినీ నమ్మించాడు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి.. పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందంటూ చిలకపలుకులు పలికాడు. ఇది నమ్మిన స్థానికులు.. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు. రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు 2 శాతం ఇంట్రెస్ట్ ఇస్తామని ఆశచూపించాడు.

వారి మాటలు నమ్మి సుమారు 7 నుంచి 8వేల మంది కోట్లలో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత సడెన్‌గా ఆఫీస్‌ను మూసేసి.. రాత్రికి రాత్రే జంప్ అయిపోయారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.

తమకు న్యాయం చేయాలని హైదరాబాద్ సీసీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. టేకుల ముక్తి రాజ్‭ను ఎక్కడున్న పట్టుకుని కఠినంగా శిక్షించాలని.. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..