AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించాలి: మాజీ మంత్రి చౌదరి

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటే విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని మాజీ ఐటి శాఖ మంత్రి జే ఏ .చౌదరి తెలిపారు. అమెరికాలోని పురాతన యునివర్సిటీ అయిన కంబర్లాండ్ యునివర్సిటీ (Cumberland university)హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్‌లోని..

విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించాలి: మాజీ మంత్రి చౌదరి
Subhash Goud
|

Updated on: Sep 16, 2024 | 3:40 PM

Share

ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి అంటే విద్యా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి ముందుకు సాగాలని మాజీ ఐటి శాఖ మంత్రి జే ఏ .చౌదరి తెలిపారు. అమెరికాలోని పురాతన యునివర్సిటీ అయిన కంబర్లాండ్ యునివర్సిటీ (Cumberland university)హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి రాష్ట్ర మాజీ ఐటి శాఖ మంత్రి జేబి.చౌదరి పాల్గొని ప్రసంగించారు. విద్యారంగంలో వస్తున్న మార్పులను గమనించి వాటికి తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం హెచ్‌సీఎల్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సుదీప్ లహరి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఉన్న మౌలిక సదుపాయాలు దేశంలో ఎక్కడ లేవని, నగరంలో పెట్టుబడులు పెట్టాడానికి అనువైన నగరం, ప్రముఖ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నారని, వారికి కావాల్సిన నైపుణ్యం ఉన్న ఉద్యోగులను తయారు చేయడానికి కంబర్లాండ్ యునివర్సిటీ సర్టిఫికెట్ కోర్సులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. డిగ్రీ తర్వాత విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారని వారు విదేశాలకు వేళ్లేందుకు అవసరం లేకుండా హైదరాబాద్ నగరంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ యునివర్సిటీ కంబర్లాండ్ సర్టిఫికెట్ కోర్సులు అందిస్తుందన్నారు. ఇందుకు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడం జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

అనంతరం పుష్పక్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వేళ్లకుండా వారికి అమెరికా కు చెందిన కంబర్లాండ్ యునివర్సిటీ నగరంలో సేవల ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్,సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్ టెక్నాలజీ పలు రకాల సర్టిఫికెట్ కోర్సులు ఎర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అమెరికాలో ఉన్న కంబర్లాండ్ యునివర్సిటీ లో తేలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 వేల మంది విద్యార్థులు చదువుకున్నారని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
మరోసారి జీరోకే అభిషేక్, శాంసన్ ఔట్.. ఎందుకంటే?
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
జూలై 1 రాశిఫలాలు: వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో శుభవార్తలు..
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..