Traffic Challans: వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే రూ.25 వేల జరిమానా!

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకుంటే అంతే సంగతి. భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని సమయాల్లో జైలుకు వెళ్లాల్సి కూడా ఉంటుంది. రూల్ బ్రేకర్ల జాబితాలో వాహన సవరణ కూడా చేర్చబడింది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు కూడా..

Traffic Challans: వాహనదారులకు హెచ్చరిక.. ఇలా చేస్తే రూ.25 వేల జరిమానా!
Traffic Rules
Follow us
Subhash Goud

|

Updated on: Sep 16, 2024 | 3:09 PM

ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. లేకుంటే అంతే సంగతి. భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని సమయాల్లో జైలుకు వెళ్లాల్సి కూడా ఉంటుంది. రూల్ బ్రేకర్ల జాబితాలో వాహన సవరణ కూడా చేర్చబడింది. అయితే దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్‌లను రద్దు చేసి శిక్షించే నిబంధన కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో మీరు మీ బైక్‌లో ఏదైనా మార్పు చేసినట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి పరిస్థితిలో 25 వేల రూపాయల వరకు చలాన్ జారీ చేస్తారు.

మీరు మీ ద్విచక్ర వాహనం లేదా ఫోర్‌ వీలర్స్‌లో ఏదైనా మార్పు చేయాలనుకున్నప్పుడు, ముందుగా మీరు ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి అనుమతి తీసుకోవాలి. సవరణ సమయంలో మీరు మీ వాహనంలో ఆటోమోటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) ఆమోదించిన భాగాలను మాత్రమే ఉపయోగించవచ్చు. ఇక్కడ మీకు 3 సవరణ షరతులు ఉంటాయి. దీని కారణంగా మీరు భారీ చలాన్ భరించాల్సి ఉంటుంది.

1. సౌండ్ సైలెన్సర్‌పై చలాన్:

చాలా సార్లు వాహనదారులు తమ మోటార్‌సైకిల్ సైలెన్సర్‌ను కూడా మారుస్తుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌లో ఉపయోగించే సైలెన్సర్ క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. చాలా మంది బైక్‌లో అలాంటి సైలెన్సర్‌ను అమర్చుకుంటారు. దాని శబ్ధం బీభత్సంగా ఉంటుంది. మీరు అలాంటి సైలెన్సర్ ఉపయోగిస్తే పోలీసులు మిమ్మల్ని పట్టుకోవచ్చు. అలాగే, మీపై భారీ చలాన్ విధిస్తారు.

2. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌పై కూడా చలాన్:

వాహనాల్లో ఎలాంటి ఫ్యాన్సీ నంబర్‌ ప్లేట్‌ను ఉపయోగించడం చట్టవిరుద్ధం. నంబర్‌ ప్లేట్‌లకు ప్రభుత్వం స్టైల్‌షీట్‌ను ఖరారు చేసింది. దీని కింద నంబర్ ప్లేట్‌లోని అన్ని అంకెలు స్పష్టంగా కనిపించాలి. వాటిని ఫ్యాన్సీగా రాసి ఉండకూడదు. ఎల్లప్పుడూ RTO ద్వారా ధృవీకరించబడిన నంబర్ ప్లేట్‌ను ఉపయోగించండి.

3. సవరణకు భారీ జరిమానా

మోటార్‌సైకిల్ లేదా స్కూటర్‌ను సవరించడం కూడా చట్టవిరుద్ధం. ఈ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు మోడిఫైడ్ మోటార్ సైకిళ్లను పట్టుకుని చలాన్ చేస్తున్నారు. కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం, ఏదైనా వాహనంలో మార్పులు చేయడం చట్టవిరుద్ధం. దీని కోసం మీకు జరిమానా విధించవచ్చు. బైక్‌ను కూడా స్వాధీనం చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: Ambani: అంబానీ కుటుంబం తాగే పాలు ఎంత ప్రత్యేకమో తెలుసా? ధర తెలిస్తే షాకవుతారు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి