AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geyser Service: గ్రీజర్‌ను ఎప్పుడు సర్వీస్‌ చేయాలి? చేయకపోతే ఏమవుతుందో తెలుసా?

మీరు చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే, మీ బాత్రూమ్ గీజర్‌ను ఇప్పుడే సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే చలికాలం ప్రారంభమయ్యే సమయానికి మీ ఇంట్లో ఉన్న గ్రీజర్‌ను ఓ సారి చెక్‌ చేసుకోవడం చాలా ముఖ్యంగా. ఎయిర్ కండీషనర్ల మాదిరిగా, గీజర్‌లు ప్రతి సంవత్సరం సర్వీస్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. వాటిని సర్వీసింగ్ చేయడానికి..

Geyser Service: గ్రీజర్‌ను ఎప్పుడు సర్వీస్‌ చేయాలి? చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
Geyser
Subhash Goud
|

Updated on: Sep 14, 2024 | 10:07 AM

Share

మీరు చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే, మీ బాత్రూమ్ గీజర్‌ను ఇప్పుడే సర్వీసింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే చలికాలం ప్రారంభమయ్యే సమయానికి మీ ఇంట్లో ఉన్న గ్రీజర్‌ను ఓ సారి చెక్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎయిర్ కండీషనర్ల మాదిరిగా, గీజర్‌లు ప్రతి సంవత్సరం సర్వీస్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి. వాటిని సర్వీసింగ్ చేయడానికి చాలా తక్కువ మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. మీరు మీ గీజర్‌ను సక్రమంగా ఉంచుకోవాలనుకుంటే శీతాకాలం ప్రారంభంలో మీకు మంచి సాంకేతిక నిపుణుడు అవసరం. వారికి ఎక్కువ పని ఉంటుంది. మీ గీజర్‌ను సర్వీసింగ్ పొందడానికి మీరు చాలా కాలం వేచి ఉండవలసి ఉంటుంది.

గ్రీజర్ మోడల్‌:

ఎలక్ట్రిక్ గీజర్‌లు, గ్యాస్ గీజర్‌లు రెండూ వేర్వేరు సర్వీస్‌లు కలిగి ఉంటాయి. సాధారణంగా సంవత్సరానికి ఒకసారి సర్వీస్ చేయాలి. రెండు గేజ్‌లను ఒకే సాంకేతిక నిపుణుడు సర్వీస్ చేయవచ్చు.

నీటి నాణ్యత:

మీ ప్రాంతంలో నీరు కాస్త మురికిగాను, ఉప్పుగాను నాణ్యత లేకుండా ఉంటే మీ గ్రీజర్‌ సమస్య పెరుగుతుంది. హార్డ్ వాటర్ గ్రీజర్‌లో కాల్షియం, ఇతర ఖనిజాల నిక్షేపాలను కలిగిస్తుంది. గీజర్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రీజర్ల ఉపయోగం:

మీరు గ్రీజర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటే, మీరు దానిని సంవత్సరానికి రెండుసార్లు సర్వీస్ చేయవలసి ఉంటుంది. క్రమం తప్పకుండా సర్వీస్ చేయకపోతే, గ్రీజర్ లోపల సమస్య ఏర్పడుతుంది. ఇది గ్రీజర్‌ను దెబ్బతీస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగాన్ని కూడా పెరగవచ్చు.

గ్రీజర్ సర్వీస్‌ను విస్మరించకండి:

గ్రీజర్ సర్వీస్‌ అనవసరమని మీరు అనుకుంటే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే. ఎయిర్ కండీషనర్‌ను సర్వీస్ చేయడం ఎంత అవసరమో, గ్రీజర్ సర్వీస్ కూడా అంతే అవసరం.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి