- Telugu News Photo Gallery Technology photos Reliance jio alerts their customers about fake calls from +92 code
Jio: ఈ నెంబర్ నుంచి కాల్స్ వస్తోందా.? యూజర్లను అలర్ట్ చేసిన జియో..
ప్రస్తుతం సైరాలు నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మారిన టెక్నాలజీతో పాటు నేరాల శైలి కూడా మారింది. మోసపూరిత కాల్స్ చేస్తూ నిండా ముంచేస్తున్నారు కేటుగాళ్లు. ఇదే విషయమై ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లను అలర్ట్ చేసింది. కొన్ని రకాల మొబైల్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇంతకీ ఏంటా నెంబర్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 13, 2024 | 9:43 PM

ప్రముఖ టెలికం సంస్థ రియలన్స్ జియో తన యూజర్లను అలర్ట్ చేసింది. +92 కోడ్ నుండి వచ్చే కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ నెంబర్లతో కాల్స్ చేసి పోలీసులమంటూ ఫేక్ కాల్స్ వస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఈ నెంబర్ల నుంచి ఎవరైనా కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేసినా, ఏదైనా బెదిరింపులకు దిగినా వెంటనే 1930 నెంబర్‌కి ఫిర్యాదుల చేయాలని లేదా సైబర్ పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

పోలీసుల పేరుతో, సీబీఐ అధికారుల పేరుతో ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయని జియో తమ యూజర్లకు తెలిపింది. మీ పేరుతో పార్శల్ వచ్చిందటూ అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ కేసు నమోదు చేయకుండా ఉండాలంటే డబ్బులు చెల్లించాలంటూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు.

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే పోలీసుల పేరుతో కాల్స్ వస్తే డిపార్ట్‌మెంట్ పేరును అడిగి తెలుసుకోండి. మీకు వచ్చిన కాల్ నిజమైందో కాదో వీలైతే నేరుగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కాన్ఫామ్ చేసుకోండి.

ఇక ఎట్టి పరిస్థితుల్లో తెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా సమాచారం, క్రెడిట్ కార్డ్ వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలు షేర్ చేయొద్దు. నిజమై పోలీసులు ఎవరూ డబ్బు అడగరనే విషయాన్ని కచ్చితంగా గుర్తించుకోవాలి.




