Ratan Tata: గుడ్‌న్యూస్.. ఇక ఐఫోన్ తయారీ మన భారత్‌లోనే.. దీపావళికి రతన్ టాటా కీలక ప్రకటన!
రతన్ టాటా.. ఈ పేరు అందరికి తెలిసిందే. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటున్నారు. అలాగే ఐఫోన్.. ఈ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు రతన్ టాటా గురించి చెప్పి ఫోన్ గురించి ఎందుకు చెబుతున్నాననేగా మీ ప్రశ్న.. మరి రతన్ టాటా.. ఐఫోన్ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. పండుగల సందర్భంగా రతన్ టాటా భారీ బహుమతులు..
రతన్ టాటా.. ఈ పేరు అందరికి తెలిసిందే. తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటున్నారు. అలాగే ఐఫోన్.. ఈ ఫోన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు రతన్ టాటా గురించి చెప్పి ఫోన్ గురించి ఎందుకు చెబుతున్నాననేగా మీ ప్రశ్న.. మరి రతన్ టాటా.. ఐఫోన్ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. పండుగల సందర్భంగా రతన్ టాటా భారీ బహుమతులు ఇవ్వనున్నారు. దీపావళి తర్వాత టాటా గ్రూప్ నుంచి భారీ ప్రకటన రానుంది. అప్పుడే దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి. రతన్ టాటా కంపెనీ ఈ ఉపాధి అవకాశాలను కల్పించనుంది. కనీసం 50 వేల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
ఐఫోన్ 16 ఈ వారం మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఐఫోన్ విదేశాల నుంచి దిగుమతి అయ్యేది. అయితే ఈసారి ఐఫోన్ ఇండియాలోనే తయారవుతుంది. ఇక ఈ ఐఫోన్ తయారీ బాధ్యతను రతన్ టాటా సంస్థ దక్కించుకుంది. టాటా ఎలక్ట్రానిక్స్ ఐఫోన్ తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌లో వచ్చే నవంబర్‌లో అంటే దీపావళి సందర్భంగా ఐఫోన్ల తయారీ ప్రారంభం కానుందని వినికిడి.
ఇది కూడా చదవండి: PM Modi: దేశ ప్రజలకు మోడీ సర్కార్ శుభవార్త.. ఇక ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికి వర్తింపు
తమిళనాడులోని 250 ఎకరాల స్థలంలో హోసూరు ప్లాంట్‌లో ఐఫోన్‌ను తయారు చేయనున్నట్లు సమాచారం. టాటా ఎలక్ట్రానిక్స్ దాదాపు రూ.6 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 15 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. విస్ట్రాన్ ఐఫోన్లను తయారు చేయడానికి కర్ణాటకలోని కోలార్‌లో ఒక ప్లాంట్‌ను కూడా కొనుగోలు చేసింది.
ఇది కూడా చదవండి: School Holidays: ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి