ఆ రెండు స్కూటర్ల మధ్య గట్టి పోటీ.. ఏది బెస్ట్‌ అంటే..

2024 Hero Destini 125 vs TVS Jupiter 125: ఇటీవలే హీరో నుంచి ఓ స్కూటర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. డెస్టినీ స్కూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ 2024 హీరో డెస్టినీ 125గా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీదారుల్లో టీవీఎస్‌ జుపిటర్‌ 125 కూడా ఒకటి. ఈ రెండూ ఒకే రకమైన బడ్జెట్లో లభిస్తుండటమే కాకుండా.. మైలేజీ కూడా అధికంగా ఇచ్చే స్కూటర్లు కావడంతో వినియోగదారులు వీటి వైపు చూస్తున్నారు. 

ఆ రెండు స్కూటర్ల మధ్య గట్టి పోటీ.. ఏది బెస్ట్‌ అంటే..
2024 Hero Destini Vs Tvs Jupiter 125
Follow us
Madhu

|

Updated on: Sep 13, 2024 | 1:28 PM

భారతీయ ఆటో మార్కెట్లో ద్విచక్రవాహనాలకు డిమాండ్‌ ఎక్కువే. ముఖ్యంగా స్కూటర్లకు. ఈ సెగ్మెంట్లు కంపెనీలు పోటీపడి మరీ ఉత్పత్తులను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే హీరో నుంచి ఓ స్కూటర్‌ మార్కెట్లోకి లాంచ్‌ అయ్యింది. డెస్టినీ స్కూటర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ 2024 హీరో డెస్టినీ 125గా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనికి మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతోంది. పోటీదారుల్లో టీవీఎస్‌ జుపిటర్‌ 125 కూడా ఒకటి. ఈ రెండూ ఒకే రకమైన బడ్జెట్లో లభిస్తుండటమే కాకుండా.. మైలేజీ కూడా అధికంగా ఇచ్చే స్కూటర్లు కావడంతో వినియోగదారులు వీటి వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 2024 హీరో డెస్టినీ 125, టీవీఎస్‌ జుపిటర్‌ 125 మధ్య ప్రధాన తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2024 హీరో డెస్టినీ 125 వర్సెస్‌ టీవీఎస్‌ జూపిటర్ 125..

ఇంజిన్ పనితీరు.. హీరో డెస్టినీ 125 స్కూటర్లో 124.6 సీసీ, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 7,000 ఆర్పీఎం వద్ద 9 బీహెచ్‌పీ, 5,500 ఆర్పీఎం వద్ద 10.4ఎన్‌ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అదేసమయంలో టీవీఎస్‌ జూపిటర్ 125 కూడా 124.8 సీసీ, సింగిల్-సిలిండర్ యూనిట్‌తోనే వస్తుంది. ఇది 6,500 ఆర్‌పీఎం వద్ద 8 బీహెచ్‌పీ, 4,500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 10.5ఎన్‌ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగితంపై పోల్చినప్పుడు డెస్టినీ 125 కొంచెం మెరుగైన శక్తి గణాంకాలను చూపిస్తోంది.

ఇంధన సామర్థ్యం.. డెస్టినీ 125 సుమారుగా లీటర్‌ పెట్రోల్‌పై 59 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది నగర ప్రయాణాలకు బాగా ఉపయోగపడుతుంది. మరోవైపు జూపిటర్ 125, ఒక లీటర్‌ పెట్రల్‌పై 57కిలోమీటర్లను ఇస్తుంది.

ఫీచర్లు.. కొత్త హీరో డెస్టినీ 125 ఐ3S (ఇడల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్), బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డీఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ హెడ్యాంప్ సెటప్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ వంటి కొత్త ఫీచర్లను హైలైట్ చేస్తుంది. టీవీఎస్‌ జూపిటర్ 125 ఫుల్‌ LED హెడ్‌ ల్యాంప్, ఇంటెల్లిగో, సౌకర్యవంతమైన రీఫ్యూయలింగ్ కోసం ఫ్రంట్ ఫ్యూయల్ ట్యాంక్, వాయిస్-సహాయక నావిగేషన్‌తో కూడిన డిజిటల్-అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, 32 లీటర్ల విశాలమైన అండర్-సీట్ స్టోరేజ్ తో వస్తుంది.

సౌకర్యం.. సౌలభ్యం.. రెండు స్కూటర్లు ముందు టెలిస్కోపిక్ షాక్‌ అబ్జర్బర్‌, వెనుకవైపు అడ్జస్టబుల్‌ షాకఅబ్జర్బర్స్‌ ఇస్తారు. డెస్టినీ 125 మునుపటి కంటే పెద్ద సీటును అందిస్తుంది. జూపిటర్ 125 మెరుగైన లెడ్రూమ్, ముందు భాగంలో ఉన్న ఇంధన ట్యాంక్ సౌకర్యాన్ని అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..