Parag Agarwal: జాబ్ పోయిందని ఉసూరుమంటూ కూర్చోలేదు.. ఏకంగా రూ. 249కోట్లతో..

చాలా మంది ఐఐటీ గ్రాడ్యూయేట్లు ఇటీవల సొంతంగా కంపెనీలు ప్రారంభిస్తున్నారు. అయితే మేం చెప్పబోయే ఈ వ్యక్తి.. ప్రపంచ కుబేరుడు, వ్యాపార దిగ్గజం అయిన ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్(ట్విట్టర్) మాజీ ఉద్యోగి. మన దేశీయ నేపథ్యం కలిగిన టెకీ అతను. తాను ఉద్యోగం నుంచి బయటకొచ్చే సమయానికి నెలకు రూ. 100 కోట్లు అతని శాలరీ. అలాంటి వ్యక్తిని ఉన్న ఫళంగా ఎలాన్ మస్క్ ఉద్యోగంలో నుంచి తీసేశాడు.

Parag Agarwal: జాబ్ పోయిందని ఉసూరుమంటూ కూర్చోలేదు.. ఏకంగా రూ. 249కోట్లతో..
Former Twitter Ceo Parag Agarwal
Follow us
Madhu

|

Updated on: Sep 13, 2024 | 2:07 PM

ఉద్యోగం అనేది జీవితానికి అవసరం. కానీ ఉద్యోగమే జీవితం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన వారు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఇది మేం చెబుతున్న విషయం కాదు. అనేక మంది నిపుణులు వివరిస్తున్న సత్యం. చాలా మంది చేస్తున్న ఉద్యోగం హఠాత్తుగా ఊడిపోగానే అంతా అయిపోయిందనే భావనలోకి వెళ్తారు. త్వరితగతిన మరో ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు సృష్టించాలని తాపత్రయపడతారు. వారే సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తారు. అలాంటి ఓ ఐఐటీ గ్రాడ్యూయేట్ మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాం. చాలా మంది ఐఐటీ గ్రాడ్యూయేట్లు ఇటీవల సొంతంగా కంపెనీలు ప్రారంభిస్తున్నారు. అయితే మేం చెప్పబోయే ఈ వ్యక్తి.. ప్రపంచ కుబేరుడు, వ్యాపార దిగ్గజం అయిన ఎలాన్ మస్క్ కు చెందిన ఎక్స్(ట్విట్టర్) మాజీ ఉద్యోగి. మన దేశీయ నేపథ్యం కలిగిన టెకీ అతను. తాను ఉద్యోగం నుంచి బయటకొచ్చే సమయానికి నెలకు రూ. 100 కోట్లు అతని శాలరీ. అలాంటి వ్యక్తిని ఉన్న ఫళంగా ఎలాన్ మస్క్ ఉద్యోగంలో నుంచి తీసేశాడు. కానీ అతను మరో ఉద్యోగం కోసం చూడలేదు. తానే ఓ ఏఐ కంపెనీని స్థాపించి, ఆదర్శంగా నిలిచాడు. అతనే పరాగ్ అగర్వాల్. ఇతని సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందాం..

అగర్వాల్ ప్రస్థానం ఇది..

ఐఐటీ-జేఈఈ ఆల్ ఇండియా (ఏఐఆర్)77 ర్యాంకర్.. భారతీయ సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ ప్రస్తుత ఎక్స్(గతంలో ట్విట్టర్) సీఈఓగా పనిచేశారు. ఆ సమయంలో భారత మీడియా ఆయన దృష్టిని ఆకర్షించారు. అప్పట్లో ఆయన జీతం రూ. 8కోట్లు. దీనికి అదనంగా రూ. 94 కోట్ల విలువైన కంపెనీ స్టాక్ యూనిట్లను కలిగి ఉన్నారు. వీటి మొత్తం రూ. 100కోట్ల కంటే ఎక్కువ. ఈ క్రమంలో ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ చేజిక్కించుకున్నారు. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో కొనుగోలు చేశారు. ఆ తర్వాత అనేక కార్యనిర్వాహక మార్పులు చేశారు. ఈ క్రమంలో అప్పటి కంపెనీ సీఈఓ అయిన పరాగ్ అగర్వాల్ ను తొలగించారు.

అగర్వాల్‌ను ఎందుకు తొలగించారు..

బ్లూమ్ బెర్గ్ కర్ట్ వాగ్నర్ రాసిన పుస్తకం ప్రకారం, బిలియనీర్ ప్రైవేట్ జెట్ స్థానాన్ని ట్రాక్ చేస్తున్న ఖాతాను బ్లాక్ చేయమని ఎలోన్ మస్క్ చేసిన అభ్యర్థనను పరాగ్ తిరస్కరించారు. ఇది ట్విట్టర్ కొనుగోలు ఒప్పందానికి ముందు జరిగింది. మస్క్ ట్విట్టర్లో చేరిన వెంటనే, అతను పరాగ్ అగర్వాల్ ను తొలగించారు. ఆ తర్వాత బిలియనీర్లకు చెందిన జెట్ల ఖాతా ట్రాకింగ్ లొకేషన్ బ్లాక్ చేయడం ప్రారంభమైంది.

ట్విట్టర్ తర్వాత అగర్వాల్ జీవితం..

లేఆఫ్ తర్వాత, పరాగ్ అగర్వాల్ దాదాపు రూ. 400 కోట్లను సీవియరెన్స్ పే(పరిహారం) పొందేందుకు అర్హులు. కానీ అతనికి ఎలాంటి పరిహారం అందలేదు. పర్యవసానంగా, అగర్వాల్, ఇతర మాజీ ట్విటర్ ఎగ్జిక్యూటివ్స్ మస్క్ పై దావా వేశారు. తమకు రూ. 1000 కోట్లకు పైగా విభజన చెల్లింపులు ఇవ్వాల్సి ఉందని కేసు వేశారు. పరాగ్ అగర్వాల్ ఇప్పుడు ఏఐ రంగంలో పురోగతి సాధిస్తున్నారు. అతను తన కొత్త వెంచర్ ప్రారంభించారు. దీని కోసం రూ. 249 కోట్ల గణనీయమైన నిధులను సమీకరించినట్లు చెబుతున్నారు. అతని స్టార్టప్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తోపనిచేసే డెవలపర్ల కోసం సాఫ్ వేర్ ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ వంటివి అభివృద్ధి చేయడంలో సాయపడతాయి. కొన్ని ఆన్ లైన్ నివేదికల ప్రకారం ఓపెన్ ఏఐ ప్రారంభ మద్దతుదారు వినోద్ ఖోస్లా నేతృత్వంలోని ఖోస్లా వెంచర్స్ అగర్వాల్ కంపెనీలో పెట్టుబడికి నాయకత్వం వహించినట్లు చెబుతున్నారు. అదనంగా, ఇండెక్స్ వెంచర్స్, ఫస్ట్ రౌండ్ క్యాపిటల్ కూడా ఫండింగ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..