Income Tax Rules: బ్యాంకు నగదు డిపాజిట్‌, విత్‌డ్రాలపై ఐటీ శాఖ నిఘా.. ఆదాయపు పన్ను శాఖ రూల్స్‌ ఏంటి?

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించే వారికి ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. ఎవరైనా పన్ను ఎగ్గొట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు చేపడుతుంది ఆదాయపు పన్ను శాఖ. అలాగే బ్యాంకు ఖాతాలను సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, విత్ డ్రాలపై నిఘా ఉంచుతుంది. ఎవరి ఖాతాల్లో ఎంత డిపాజిట్‌..

Income Tax Rules: బ్యాంకు నగదు డిపాజిట్‌, విత్‌డ్రాలపై ఐటీ శాఖ నిఘా.. ఆదాయపు పన్ను శాఖ రూల్స్‌ ఏంటి?
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Sep 13, 2024 | 10:15 AM

ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లించే వారికి ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతుంది. ఎవరైనా పన్ను ఎగ్గొట్టినా, నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు చేపడుతుంది ఆదాయపు పన్ను శాఖ. అలాగే బ్యాంకు ఖాతాలను సైతం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ముఖ్యంగా నగదు డిపాజిట్లు, విత్ డ్రాలపై నిఘా ఉంచుతుంది. ఎవరి ఖాతాల్లో ఎంత డిపాజిట్‌ అవుతుంది? ఎంత విత్‌డ్రాలు చేస్తున్నారనే దానిపై దృష్టి పెడుతుంది. మనీలాండరింగ్, పన్ను ఎగవేత, ఇతర చట్టవిరుద్ధమైన ఆర్థిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఇలాంటి చర్యలు చేపడుతూనే ఉంటుంది. మరి బ్యాంకు ఖాతాలు, నగదు విత్‌డ్రా, డిపాజిట్లపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం.

ఆ డిపాజిట్లపై 60 శాతం పన్ను

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 68 ప్రకారం, బ్యాంకు అకౌంట్లో నగదు డిపాజిట్ చేసే వ్యక్తులు తమ ఆదాయ మూలాన్ని వెల్లడించడానికి సిద్ధంగా ఉండాలని గుర్తించుకోండి. ఎంత డిపాజిట్‌ చేసినా ఒక వేళ ఆదాయపు పన్ను దాని వివరాలు అడిగితే అందించేందుకు సిద్ధంగా ఉండాలి. నగదు డిపాజిట్‌ మూలాన్ని అందించడంలో విఫలమైతే 25 శాతం సర్‌ ఛార్జ్, 4 శాతం సెస్‌ సహా 60శాతం పన్ను భరించాల్సి ఉంటుందని గుర్తించుకోండి. ఒక వేళ మీరు సరైన ఆధారాలు అందించకపోతే నోటీసు పంపుతుంది. ఆ తర్వాత మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు:

బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు మించిన నగదు జమ చేసినట్లయితే మీరు తప్పకుండా ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. కరెంట్ ఖాతాలో డిపాజిట్ లిమిట్ రూ.50 లక్షలు. ఈ పరిమితి దాటితే నిధుల మూలానికి సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ఐటీ శాఖకు అందించాలి. లేకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: School Holidays: ఇక విద్యార్థులకు పండగే.. 14 నుంచి విద్యాసంస్థలకు వరుస సెలవులు!

ఇక ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ చట్టంలోని సెక్షన్ 194ఎన్ ప్రకారం పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రాలపై పన్ను సమస్యలు ఉంటాయి. ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో వారి బ్యాంక్ ఖాతా నుంచి రూ. కోటి కంటే ఎక్కువ విత్‌ డ్రా చేస్తే, దానికి సంబంధించి మూలంలో 2శాతం పన్ను(టీడీఎస్) పడుతుంది. అయితే గత 3 ఏళ్లుగా ఐటీఆర్ దాఖలు చేయని వ్యక్తులకు రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌ డ్రాలపై టీడీఎస్ వర్తిస్తుంది. రూ.కోటి కంటే ఎక్కువ విత్ డ్రాలపై టీసీఎస్ వద్ద 5శాతం పన్ను వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి: Hindenburg: ఆదానీ సొమ్మును స్విస్‌ బ్యాంకు నిలిపివేసిందా? మరో బాంబు పేల్చిన హిండెన్‌బర్గ్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే