Gau Raksha Maha Padayatra: తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం: సినీ నటుడు సుమన్

తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం.. అని సినీ నటుడు సుమన్ అన్నారు. గో రక్షణ మహా పాదయాత్ర భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు.

Gau Raksha Maha Padayatra: తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం: సినీ నటుడు సుమన్
Suman
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 16, 2024 | 4:33 PM

తల్లి పాల తర్వాత గోవు పాలు శ్రేష్టం.. అని సినీ నటుడు సుమన్ అన్నారు. గో రక్షణ మహా పాదయాత్ర భక్తుల ఆత్మీయ సమ్మేళన కాచిగూడలోని శ్యామ్ మందిర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. బాలకృష్ణ గురుస్వామి చేపట్టనున్న కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు గో పాదయాత్రకు సినీ యాక్టర్ సుమన్ సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ గోవు ఒక మంచి సాధు జంతువని అన్నారు. దీనిని రక్షించు కోవడం మన అందరి భాధ్యత అన్నారు. గోవు ఆయుర్వేదంగా కూడా మనకు ఉపయోగపడుతుందన్నారు. బాలకృష్ణ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని.. ఆయన యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.

అనంతరం అఖిల భారత గో సేవ ఫౌండేషన్ ఫౌండర్ అధ్యక్షుడు బాలకృష్ణ గురు స్వామి మాట్లాడుతూ.. గో రక్షణ, భూ రక్షణ, పర్యావరణ రక్షణ, దేశ రక్షణ, గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గో రక్ష మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోవుని కాపాడుకుందాం.. పర్యావరణాన్ని రక్షించుకుందామని తెలిపారు. దేశవాళీ గోవులను, ఎడ్లను కాపాడాలని గోఉత్పత్తులను వాడాలని సూచించారు. గో ఆధారిత వ్యవసాయం చేసి భూమిని.. పర్యావరణాన్ని కాపాడాలన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్య కరంగా జీవించే విధంగా.. వైజ్ఞానిక పరంగా, గో సంతతి వల్ల కలిగే ప్రయోజనాలు ఊరూరా చాటిచెబుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు.. అన్ని జాతులు, కులాలు, మతాలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ దేశ ప్రజలందరూ బాగుండాలని ఈ గో రక్షా మహా పాదయాత్ర చేస్తున్నానని బాలకృష్ణ గురుస్వామి తెలిపారు. ఇతర దేశాలు మన గోవు పేరుతో వివిధ ప్రయోగాలను వినియోగించుకుంటున్నారని, కానీ మనదేశంలో గోవులని నిర్దాక్షిణ్యంగా కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీడియో చూడండి..

ఈ నెల 27 నుండి 2025 మార్చ్ 27 తేదీ వరకు 180 రోజుల పాటు 14 రాష్ట్రాల మీదుగా పాదయాత్ర జరుగుతుందని బాలకృష్ణ తెలిపారు. దాదాపు 4900 kms కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ఆరుగురు బృందంగా పాదయాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ గో మాత గొప్ప తనం తెలవాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సాధువులు, జమ్మూ కాశ్మీర్ పండిత్, గోమాత సేవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..