విషాదం..కెనడాలోని సరస్సులో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు మృతి

హైద‌రాబాద్ న‌గ‌రంలో నివాసం ఉంటున్న ప్ర‌ణీత్ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృత‌దేహాన్ని వీలైనంత త్వ‌ర‌గా హైద‌రాబాద్‌కు తెప్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మీర్‌పేట‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

విషాదం..కెనడాలోని సరస్సులో ఈతకు వెళ్లి హైదరాబాద్ యువకుడు మృతి
Hyderabad resident dies in canada
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 16, 2024 | 7:00 PM

కెన‌డాలో హైద‌రాబాద్ వాసి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.. ఇటీవలే కెనడాలో మాస్టర్స్ పూర్తి చేసిన హైదరాబాద్ వ్యక్తి సెప్టెంబర్ 15 ఆదివారం తన సోదరుడి పుట్టినరోజు జరుపుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు టొరంటో సరస్సులో మునిగిపోయాడు. మృతుడు రంగారెడ్డి జిల్లా మీర్‌పేటకు చెందిన ప్రణీత్‌గా గుర్తించారు. అతను కెనడియన్ విశ్వవిద్యాలయంలో తన డిగ్రీని పూర్తి చేశాడు. స్నేహితులతో ఉంటూ ఉద్యోగం కోసం చూస్తున్నాడు.

హైద‌రాబాద్ మీర్‌పేట‌కు చెందిన ప్ర‌ణీత్.. త‌న అన్న పుట్టిన రోజు సంద‌ర్భంగా స్నేహితుల‌తో క‌లిసి టోరంటోలోని లేక్ క్లియ‌ర్‌కు స్విమ్మింగ్‌ చేసేందుకు వెళ్లారు. ఈత కొడుతూ ప్ర‌మాద‌వ‌శాత్తూ నీట మునిగి ప్ర‌ణీత్ చ‌నిపోయాడు. మృతుడి త‌ల్లిదండ్రుల‌కు స్నేహితులు స‌మాచారం అందించారు. స్థానిక అధికారులు అప్రమత్తమై ప్రణీత్‌ మృతదేహాన్ని వెలికితీసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. టొరంటో పోలీసులు ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..

హైద‌రాబాద్ న‌గ‌రంలో నివాసం ఉంటున్న ప్ర‌ణీత్ త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. మృత‌దేహాన్ని వీలైనంత త్వ‌ర‌గా హైద‌రాబాద్‌కు తెప్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మీర్‌పేట‌లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..