Watch: భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ సాహసం.. అడవిలో 8 కి మీ నడుస్తూ..
చక్కటి వాతావరణంతో పాటు కల్మషం లేని ఆదివాసులను చూసి మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. అతి త్వరలోనే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ జితేష్ పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ వి జితేష్ పాటిల్ సాహసం చేశారు. ఆదివారం ఉదయం 6 గంటలకు చండ్రుగొండ మండలం బెండల పాడు అడవి ప్రాంతానికి చేరుకున్న అతను… ఎనిమిది కిలోమీటర్లు అడవి మార్గంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి.. పల్లేరు వీరభద్రస్వామి ఆలయంతో పాటుగా.. అటవీ ప్రదేశాన్ని సందర్శించారు. తన ఈ పర్యటనలో ఏ ఒక్క అధికారికి కూడా సమాచారం ఇవ్వకుండా స్వయంగా ఆయనే అక్కడి గ్రామస్తులను వెంట తీసుకొని అడవిలోకి బయల్దేరారు.
చుండ్రుగొండ ఆదివాసులతో కలసి బెండాలపాడు అడవుల్లో 16 కి.మీ దూరం నడుస్తూ కనకగిరి కొండలను ఎక్కుతూ ప్రకృతిని ఆస్వాదించారు. కొండలపై ఉన్న కాకతీయ రాజుల స్థావరాలను, కొనేరులను, దేవాలయాలను సందర్శించారు. ఆదివాసులు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. ఈరోజు తాను ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూశానని చెప్పారు. విహార యాత్రల కోసం వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, బెండాల పాడు అటవీ ప్రాంతం ఒక అద్భుత విహార యాత్ర ప్రాంతమని ఆయన అభివర్ణించారు.
ఈ వీడియో చూడండి..
చక్కటి వాతావరణంతో పాటు కల్మషం లేని ఆదివాసులను చూసి మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. అతి త్వరలోనే ఈ ప్రాంతం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక అద్భుత పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ జితేష్ పాటిల్ హామీ ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..