చిన్నతనంలో మింగేసిన ఆట వస్తువు.. 26ఏళ్ల తర్వాత ముక్కుల్లోంచి ఇలా..

ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆండీ ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనంలో తాను చేసిన ఈ పని గురించి ఆలోచిస్తే.. అప్పుడు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని ఆండీ చెప్పారు.

చిన్నతనంలో మింగేసిన ఆట వస్తువు.. 26ఏళ్ల తర్వాత ముక్కుల్లోంచి ఇలా..
Adam Norton
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2024 | 10:01 PM

చిన్నతనంలో చేసే తప్పులు నవ్వులాటగా అనిపిస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో చిన్నతనంలో చేసిన చిన్నచిన్న తప్పిదాలే.. భవిష్యత్తులో తీరని నష్టానికి కారణంగా మారుతుంటాయి. అలాంటిదే ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు తన చిన్నతనంలో ఒక చిన్న బొమ్మను నోట్లో పెట్టుకుని పొరపాటున మింగేశాడు..అది దాదాపు 26 ఏళ్ల తర్వాత ఆ బొమ్మ తన నోట్లో కూరుకుపోయి ఉందని అతనికి తెలిసింది. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా సదరు వ్యక్తి స్వయంగా ఈ సమాచారాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…

అరిజోనా నివాసి అయిన 32 ఏళ్ల ఆండీ నార్టన్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను నెటిజన్లకు షేర్‌ చేశాడు. తన చిన్నతనంలో తనకు చాలా శ్వాస సమస్యలు ఉన్నాయని చెప్పాడు. అతను దాని కోసం చికిత్స పొందుతున్నాడు. అతని ముక్కును గోరువెచ్చని నీటితో శుభ్రం చేయమని డాక్టర్ సూచించాడు. తను ఆరు నెలల పాటు వేడి నీళ్లతో స్నానం చేసేవాడినని, వేడి నీళ్లతో ముక్కు శుభ్రం చేసుకునేవాడినని, కానీ ఒకరోజు ఏదో జరిగిందని, దాని గురించి ఆలోచిస్తూ నవ్వు ఆపుకోలేకపోతున్నానని ఆండీ చెప్పాడు. అప్పుడు ఒక బొమ్మ తన ముక్కులో ఇరుక్కుపోయిందని ఆండీ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

తనకు 6 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ఆడుకుంటుండగా, తనకు తెలియకుండానే తన ముక్కులో ఒక బొమ్మ పెట్టుకున్నానని చెప్పాడు. బొమ్మ నోట్లోపలికి వెళ్లడంతో దాన్ని పట్టుకుని తీయడం కష్టమైంది. అటువంటి పరిస్థితిలో, అతను బొమ్మను బయటకు తీయడానికి మరొక బొమ్మను ఉపయోగించాడు. అది కూడా ముక్కులో విరిగిపోయిందట. చివరకు బాధలో, అతను తన తల్లిని పిలిచాడు. అమ్మ వచ్చి తిట్టి బొమ్మ తీయడం మొదలుపెట్టింది. అప్పుడు ఒక బొమ్మ ముక్క బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆండీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైంది. తీవ్రమైన ఆస్తమాతో బాధపడ్డాడు. డాక్టర్ సలహా మేరకు గోరువెచ్చని నీళ్లతో ముక్కు శుభ్రం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఒకరోజు ముక్కు శుభ్రం చేస్తుండగా ముక్కులోంచి ఒక ముక్క వచ్చింది. అది చూడగానే ఆండీకి తన బాల్యం గుర్తుకొచ్చింది.

ఈ వీడియో చూడండి..

ఈ ముక్క తన చిన్నతనంలో తన ముక్కులో పెట్టుకున్న అదే బొమ్మకు సంబంధించినదిగా ఆండీకి గుర్తుకు వచ్చింది. ఆ ముక్కను ప్లాస్టిక్ సంచిలో ఉంచి వైద్యుని వద్దకు వెళ్తానని చెప్పాడు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఆండీ ఆనందం వ్యక్తం చేశారు. చిన్నతనంలో తాను చేసిన ఈ పని గురించి ఆలోచిస్తే.. అప్పుడు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదని ఆండీ చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..