AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాప్‌రే.. B.Ed చదివిన బ్యూటీ..! రెండో పెళ్లి కోసం వరుడు కావాలంటూ ప్రకటన..! కోర్కెలు నెక్ట్స్ లెవల్ గురూ..

సొంతంగా 3 BHK ఇల్లు ఉండాలట. ఇంటి పనులు చేయడానికి పనిమనిషి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అంత క్వాలిఫైడ్ వరుడు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి.. మీరు ఒకసారి ట్రై చేయగలరేమో చూడండి.. అంటూ ఓ మహిళ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

బాప్‌రే.. B.Ed చదివిన బ్యూటీ..! రెండో పెళ్లి కోసం వరుడు కావాలంటూ ప్రకటన..! కోర్కెలు నెక్ట్స్ లెవల్ గురూ..
Woman's Groom Criteria
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2024 | 8:39 PM

Share

భారతీయ వివాహ వ్యవస్థలో రెండు రకాల మనుషులు ఉన్నారు. కట్నం లేకుండా ఆడపిల్లలు కావాలని కోరే వరులు ఒకవైపు, వరుడికి లక్షల జీతం, కోట్ల ఆస్తి ఉండాలని కోరే వధువు తల్లిదండ్రులు మరోవైపు. తమ కూతుర్ని ఇవ్వటానికి ఎలాంటి వరుడు కావాలో తల్లిదండ్రులు పెట్టే షరతులు వింటూనే ఉంటాం.. అయితే, ఇక్కడ ఓ మహిళ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమై తనకు వరుడు కావాలని పోస్ట్ చేసి.. అందులో పలు రకాల షరతులు పెట్టింది. ఆమెకు కాబోయే భర్తకు ఏడాదికి 30 లక్షల రూపాయల జీతం ఉండాలని కోరింది. తనకు 3 బీహెచ్‌కే ఇల్లు కావాలని ఆ పోస్ట్‌లో వివరించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

పెళ్లయిన భర్తతో గొడవపడి విడాకులు తీసుకున్న ఓ మహిళ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైంది. వరుడి కోసం ఆన్‌లైన్‌లో ప్రచారం చేసింది. ఇందులో ఆమె తనకు కాబోయే వరుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో పేర్కొంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) డిగ్రీ చదివిన ఆమె ఏటా రూ.1.3లక్షలు సంపాదిస్తోంది. తనకు ఏడాదికి 30 లక్షలు జీతం వచ్చే వరుడు కావాలని కోరుతూ చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి ఉండాలి, MBA, MS, కనీసం రూ. 30 లక్షల వార్షిక వేతనం.. భారత్‌, అమెరికా లేదా యూరప్‌లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఆమె వివరాలు తెలిపింది. అంతేకాదు ఆమెకు గతంలోనే పెళ్లై భర్తతో గొడవపడి విడాకులు తీసుకుంది. అయితే ఇప్పుడు ఆ మహిళ రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం ఆన్ లైన్ లో పెళ్లికొడుకు కావాలంటూ అంటూ ప్రచారం చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..

అంతే కాదు వరుడి జీతం రూ. 30 లక్షలు ఉండాలని, అప్పులు ఉండకూడదని, పేరెంట్స్ కూడా ఉండకూడదని షరతు పెట్టింది. అంతేకాదు..ఒకవేళ పేరెంట్స్ ఉంటే పెళ్లయ్యాక వాళ్ల దగ్గర ఉండకూడదనే కండీషన్‌ కూడా పెట్టింది.. కానీ, తన తల్లిదండ్రులు తనపైనే ఆధారపడి ఉన్నందున వారితోనే జీవిస్తానని చెప్పింది. సొంతంగా 3 BHK ఇల్లు ఉండాలట. ఇంటి పనులు చేయడానికి పనిమనిషి ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అంత క్వాలిఫైడ్ వరుడు ఎవరైనా ఉంటే నన్ను సంప్రదించండి.. మీరు ఒకసారి ట్రై చేయగలరేమో చూడండి.. అంటూ ఓ మహిళ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..