దానిమ్మ పువ్వు చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? ఇలాంటి సమస్యలకు దివ్యౌషధం..!

దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు అన్నీ ఔషధంగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్యవంతమైన శరీరం కావాలనుకునే వారు దానిమ్మ పూల చూర్ణాన్ని ఉపయోగించాలని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం దానిమ్మ పూలను నీడలో ఆరబెట్టి చూర్ణం తయారు చేసుకుని ఉపయోగించుకోవచ్చునని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 15, 2024 | 5:35 PM

దానిమ్మ పువ్వును చూర్ణం చేసి అర స్పూను చొప్పున తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవని అంటున్నారు. అంతేకాదు..దానిమ్మ పువ్వును మెత్తగా చేసి అలర్జీలు, కిటకాలు కుట్టిన ప్రదేశంలో రాయటంవల్ల పొక్కులు మానిపోతాయి.

1 / 5
దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టి అందులో తేనె కలుపుకుని తింటే శరీరం దృఢంగా తయారవుతుంది. రుతువిరతి సమయంలో స్త్రీలు మానసికంగా భావోద్వేగానికి గురై చేతులు, కాళ్లు, తుంటి కీళ్ల నొప్పులకు గురవుతారు. అలాంటి సమయంలో దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే ఫలితం వుంటుంది.

2 / 5
దానిమ్మ పువ్వు కషాయం తీసుకుంటే మహిళల్లో పలు రుగ్మతలను నిరోధించవచ్చు. పువ్వును చూర్ణం చేసి రసాన్ని పిండుకుని ఒక ఔన్సు రసం తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే, కొద్ది రోజుల్లోనే ఆడవారిలో వచ్చే సమస్యలు నయం చేస్తుంది.

3 / 5
దానిమ్మ పువ్వులో తాటిబెల్లం కలిపి కషాయం చేసి తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి కలుగుతుంది. దానిమ్మ పువ్వు చూర్ణం అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. నీళ్ల విరేచనాలు, నోటిపూత తగ్గించడానికి ఉపయోగిస్తారు.

4 / 5
రక్తంలో షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసే శక్తి దానిమ్మ పూలకు వుంది. గుండె ఆరోగ్యానికి దానిమ్మ పూలు మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు దానిమ్మ పూలు కషాయం తాగితే ఫలితం వుంటుంది.

5 / 5
Follow us