- Telugu News Photo Gallery Cinema photos Actress Megha Akash Married Her Boy Friend Saai Vishnu, Wedding Photos Goes Viral
Megha Akash Wedding: వివాహ బంధంలోకి మేఘ ఆకాష్.. ప్రియుడితో హీరోయిన్ ఏడడుగులు.. పెళ్లి ఫోటోస్ వైరల్..
టాలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈరోజు (సెప్టెంబర్ 15న) మేఘ ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయి విష్ణుతో ఘనంగా జరిగింది. చెన్నైలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగ్గా పెళ్లి ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి. ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య ఇద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు
Updated on: Sep 15, 2024 | 4:44 PM

టాలీవుడ్ హీరోయిన్ మేఘ ఆకాష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈరోజు (సెప్టెంబర్ 15న) మేఘ ఆకాష్ పెళ్లి ఆమె ప్రియుడు సాయి విష్ణుతో ఘనంగా జరిగింది. చెన్నైలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగ్గా పెళ్లి ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.

ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు మధ్య ఇద్దరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం మేఘ ఆకాష్, విష్ణు పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి.

నూతన జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటీవలే తన ప్రియుడితో నిశ్చితార్థం జరిగిందంటూ ఎంగేజ్మెంట్ ఫోటోస్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోస్, మెహందీ, సంగీత్ పిక్స్ వైరలయ్యాయి.

నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది మేఘ ఆకాష్. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో మేఘకు అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కాకపోవడంతో ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు.

ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, రాధే, రాజ రాజ చోర, డియర్ మేఘా వంటి చిత్రాల్లో నటించింది మేఘ ఆకాష్. ప్రస్తుతం ఆమె చేతిలో పలు తెలుగు సినిమాలు ఉన్నాయి. మేఘ భర్త సాయి విష్ణు రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి.




