- Telugu News Photo Gallery Cinema photos Actress Ananthika Sanilkumar Shares Beautiful Saree Photo On Onam Festival Spcial
Tollywood: కుర్రాళ్ల మతిపోగొడుతున్న కాటుక కళ్లు.. ఓనమ్ సంబరాల్లో తళుక్కుమన్న హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా సత్తా చాటుతుంది. ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరేట్. ఎవరో తెలుసా.. ? తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మకు నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.
Updated on: Sep 15, 2024 | 4:18 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే హీరోయిన్గా సత్తా చాటుతుంది. ఒక్క సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల హాట్ ఫేవరేట్. ఎవరో తెలుసా.. ?

తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మకు నెట్టింట ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అందాల తార. తనే హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్.

2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించకపోయినప్పటికీ అనంతికకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇటీవలే ఎన్టీఆర్ బామ్మర్ది నటించిన మ్యాడ్ చిత్రంలో నటించింది.

ఈ మూవీలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో ఒక్కసారిగా అనంతిక ఫాలోయింగ్ మారిపోయింది.ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది. ఇటీవలే రజినీకాంత్ నటించిన లాల్ సలామ్ చిత్రంలో నటించింది.

ప్రస్తుతం డైరెక్టర్ ఫణింద్ర నర్సెట్టి రూపొందిస్తున్న ఎనిమిది వసంతాలు చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఓనమ్ ఫెస్టివల్ సందర్భంగా కసావు చీరలో మెరిసింది. ప్రస్తుతం ఆనంతిక ఫోటోలకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.




