- Telugu News Photo Gallery Cinema photos Heroine Anupama Parameswaran follow new trend in new concepts in Film industry Telugu Actress Photos
Anupama Parameswaran: ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తున్న అనుపమ.! ఈసారి టిల్లుని మించి..
మొనాటనీ గురించి అప్పుడప్పుడూ మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. రోజూ చేసే పనే చేయాల్సి వచ్చినా కొత్తగా ఇంకేదో కలగలిపి చేస్తే బావుంటుందనే భావన మనలో చాలానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి విషయం గురించే చెబుతున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. నూడుల్స్ జుట్టు సుందరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి.? గమ్యం చేరుకోవాలంటే రోజూ ఒకటే రూట్లో నడవాల్సిన అవసరం ఉందా.?
Updated on: Sep 15, 2024 | 4:19 PM

మొనాటనీ గురించి అప్పుడప్పుడూ మనం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. రోజూ చేసే పనే చేయాల్సి వచ్చినా కొత్తగా ఇంకేదో కలగలిపి చేస్తే బావుంటుందనే భావన మనలో చాలానే ఉంటుంది.

ఇప్పుడు అలాంటి విషయం గురించే చెబుతున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. నూడుల్స్ జుట్టు సుందరి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏంటి.? గమ్యం చేరుకోవాలంటే రోజూ ఒకటే రూట్లో నడవాల్సిన అవసరం ఉందా.?

రోజుకో రూట్ సెలక్ట్ చేసుకుంటే ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది కదా.. ఇదీ ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ చెప్పాలనుకున్న మాట. ప్రతి రోజూ మేకప్ వేసుకున్నా, పర్పస్ డిఫరెంట్‌గా ఉండాలనుకుంటున్నారు మిస్ బ్యూటీ.

రీసెంట్‌గా టిల్లు స్క్వయర్‌లో అనుపమ పరమేశ్వరన్‌ని చూసిన వారు.. వావ్.. ఆమె ఈమేనా.. అని ఆశ్చర్యపోయారు. అంతలా చేంజోవర్ కావడానికి కారణం కూడా మైండ్ సెట్టేనని చెబుతున్నారు అనుపమ.

కంఫర్ట్ జోన్‌ని క్రియేట్ చేసి, గిరిగీసుకుని కూర్చుంటే కొన్నాళ్లకు చేసే పని మీద బోర్ వచ్చేస్తుందన్నది ఈ భామ చెబుతున్న మాట. నటిగా తనకు సవాలు విసిరే కేరక్టర్ల కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూనే ఉంటానని అంటున్నారు మిస్ పరమేశ్వరన్

కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ తనలో తనకు నచ్చింది ఆ జీల్ అని చెబుతున్నారు. వెరైటీ కేరక్టర్లు ఎక్కడుంటే అక్కడ వాలిపోవాలనిపిస్తుందట ఈ బ్యూటీకి.

తెలుగు, తమిళ్‌తో పాటు మలయాళంలోనూ చాలా సినిమాలే చేస్తున్నారు టిల్లు స్క్వేర్ బ్యూటీ. దాదాపు అరడజను సినిమాలతో బిజీగా ఉన్నా, ఎప్పుడూ అలిసిపోయినట్టు అనిపించడం లేదంటున్నారు అనుపమ.




